సూపర్‌మ్యాన్ (చలనచిత్రం)

సూపర్‌మ్యాన్
దస్త్రం:Superman ver1.jpg
దర్శకత్వమురిచర్డ్ డోనర్
నిర్మాతAlexander Salkind
Ilya Salkind
Pierre Spengler
రచనMario Puzo
(Screenplay and Story)
David Newman
(Screenplay)
Leslie Newman
(Screenplay)
Robert Benton
(Screenplay)
Tom Mankiewicz
(uncredited)
Jerry Siegel
(Characters)
Joe Shuster
(Characters)
తారాగణంMarlon Brando
Gene Hackman
Christopher Reeve
Margot Kidder
సంగీతంJohn Williams
సినిమెటోగ్రఫీGeoffrey Unsworth
కూర్పుStuart Baird
Michael Ellis
స్టుడియోDovemead
Film Export A.G.
International Film Productions
డిస్ట్రిబ్యూటరుWarner Bros. Pictures
విడుదలైన తేదీలు10 డిసెంబరు 1978 (1978-12-10)
(United States)
21 December 1978
(United Kingdom)
నిడివి143 minutes
(Theatrical)
151 minutes
(Expanded Edition)
దేశముPanama
Switzerland
United Kingdom
భాషఆంగ్లం
బడ్జెట్$55 million
మొత్తం వ్యయం$300.22 million
Followed bySuperman II

సూపర్‌మ్యాన్‌ (సూపర్‌మ్యాన్‌:ద మూవీ అని కూడా పిలువబడుతుంది). డిసి కామిక్స్‌లోని ఒక పాత్ర ఆధారంగా అదే పేరుతో 1978లో నిర్మించిన సూపర్‌హీరో చిత్రం ఇది. రిచర్డ్‌ డొనర్‌ దీనికి దర్శకత్వం వహించాడు. ఇందులో క్రిస్టోఫర్‌ రీవ్స్‌ సూపర్‌మ్యాన్‌గా నటించగా, ఇతర పాత్రలను గెన్‌ హక్‌మన్‌, మార్గోట్‌ కిడ్డర్‌, మార్లన్‌ బ్రాండో, గ్లెన్‌ ఫోర్డ్‌, ఫిలిస్‌ థాస్టర్‌, జాకీ కూపర్‌, మార్క్‌ మెక్‌క్లూర్‌, వెలరీ ప్రీనీ మరియు నెడ్‌ బ్యూటీలు పోషించారు. క్రిప్టాన్‌ గ్రహంలో సూపర్‌మ్యాన్‌ కాల్‌ ఎల్‌గా పుట్టి, స్మాల్‌ విల్లీలో పెరగడం, క్లార్క్‌ కెంటగా అనే రిపోర్టర్‌గా మారడం, మెట్రోపోలీస్‌లో మంచి మర్యాద ఉన్న వ్యక్తిగా అందరిని మన్ననలు అందుకోవడం, లూయిస్‌లైన్‌తో రొమాన్స్‌ అదేవిధంగా విలన్‌ లక్స్‌ లూథర్‌ను ఎదుర్కోవడం ఈ చిత్రంలో ఉంటాయి.

1973లో ఇలా సాల్‌కైండ్‌కు ఈ సినిమా ఆలోచన వచ్చింది. డోనర్‌ను దర్శకునిగా ఎంచుకోవడానికి ముందు గ్లే హామిల్టన్‌ వంటి ఎంతో మంది దర్శకులు, స్క్రీన్‌ రైటర్లు (మార్టినో ఫిజో, డేవిడ్‌ మరియు లెస్లీ న్యూమన్‌ మరియు రాబర్ట్‌ బెంటన్‌) వంటి వారు ఈ ప్రాజెక్టులో పాల్పంచుకున్నారు. స్క్రిప్టులో వైవిధ్యం లోపించిదంటూ డోనర్‌ స్క్రిప్టును తిరగరాసే పనిని టామ్‌ మ్యాన్‌కివిజ్‌కు అప్పగించాడు. మ్యాన్‌కివిజ్‌ను సినిమాలో క్రియేటివ్‌ కన్సల్టెంట్‌గా పేర్కొన్నారు. ఏకకాలంలో సూపర్‌మ్యాన్‌, సూపర్‌మ్యాన్‌2ను రూపొందించాలని నిర్ణయించారు.

ప్రాథమికంగా షూటింగ్‌ మార్చి 1977లో ప్రారంభమై అక్టోబరు, 1978 వరకు సాగింది. డోనర్‌, నిర్మాతలకు మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడటంతో సూపర్‌మ్యాన్‌2ను అపేసి, మొదటి సినిమాను పూర్తిచేయాలని నిర్ణయించారు. సీక్వెల్‌కు సంబంధించి డోనర్‌ అప్పటికే 75శాతం[1] షూటింగ్‌ను పూర్తిచేశాడు.Superman II: The Richard Donner Cut ఏదైనప్పటికీ ఈ విధంగా విడుదలైన సూపర్‌మెన్‌ అటు విమర్శల అభిమానాన్ని, ఇటు ఆర్థికపరమైన విజయాన్ని సాధించింది. సూపర్‌మ్యాన్‌ మరియు జీసస్‌ చిత్రాల చిత్రీకరణ ఒకే విధంగా ఉందని పలువురు సమీక్షకులు పేర్కొన్నారు.[2] ఈ సినిమా సాధించిన పేరు ప్రఖ్యాతులు, సైన్సు ఫిక్షన్‌ సినిమాలకు పునర్జీవం కల్పించడంలోపాటు, సూపర్‌హీరో చిత్రాల సంస్కృతిని రూపొందించడానికి సాయపడింది.

Other Languages