సంస్కృతి

ఇరాన్కు చెందిన ఫర్‌హంగ్ సంస్కృతి, ఇరానియన్ నాగరికతకు చిహ్నం. పర్షియన్ సంగీతకారిణులు (అష్ట-స్వర్గాల సౌధం లోగల పెయింటింగ్ చిత్రం)
అజర్‌బైజాన్‌లో క్రీ.పూ. 10,000 సంవత్సరాలనాటి రాతి చెక్కడాలు - గోబుస్తాన్

సంస్కృతి ( లాటిన్, స్పానిష్, పోర్చుగీస్ Cultura, ఫ్రెంచ్, ఆంగ్లం Culture, జర్మన్, స్వీడిష్ Kultur) అనేది మానవ సమాజం జీవన విధానంలో ప్రముఖమైన విషయాలను - అనగా జీవనం, ఆచారాలు, వ్యవహారాలు, ప్రమాణాలు, మతం, సంబంధాలు, పాలన - వంటివాటిని సూచించే పదం. దీనికి ఆంగ్ల పదమైన కల్చర్ (సంస్కృతి) లాటిన్ పదం కల్చుర లేదా కొలెరె అనేవి "పండించడం" అనగా వ్యవసాయం చేయడం నుండి ఉద్భవించాయి. [1] ఒక సమాజంలో ముఖ్యమైన పద్ధతులు మరియు నిర్మాణాలు మరియు వ్యవస్థలు ఆ సమాజం యొక్క సంస్కృతిని సూచిస్తాయి. సంస్కృతిని సూచించే సంకేతాలు, నిర్మాణాలు, వ్యవస్థలు, ఆచారాలు, వ్యవహారాలు ఇదమిత్థమైన హద్దులు లేవు, అవి నిరంతరాయంగా మారుతుంటాయి. ఒకదానితో ఒకటి కలుస్తూ, విడిపోతూ పరిణామం చెందుతుంటాయి. [2]

ఒక సమాజం జీవనంలో మిళితమైన కళలు, నమ్మకాలు, సంస్థలు, తరాలలో జరిగే మార్పులు, తరాల మధ్య వారసత్వంగా కొనసాగే విధానాలు అన్నీ కలిపి "సంస్కృతి" అంటారు. ఒక సమాజం యొక్క సంపూర్ణ జీవన విధానమే ఆ సమాజపు సంస్కృతి అని నిర్వచింపవచ్చును. [3] ఆ సమాజంలో పాటించే ఆచారాలు, పద్ధతులు, అభివాదాలు, వస్త్రధారణ, భాష, మతం, ఆటలు, విశ్వాసాలు, కళలు - అన్నీ కలిపి సంస్కృతి అవుతాయి. గతించిన కాలం గురించి భవిష్యత్ తరాలకు అందించే వారధి సంస్కృతి

సంస్కృతి నిర్వచనం

ఒక సమాజం చేసిన, వాడిన పరికరాలు, నిర్మించిన కట్టడాలు, వారి సంగీత, కళ, జీవన విధానం, ఆహారం, శిల్పం, చిత్రం, నాటకం, నాట్యం, సినిమా - ఇవన్నీ ఆ సమాజపు సంస్కృతిని సూచిస్తాయి. [4] ఒక సమాజంలో ఉన్న వస్తు వినియోగం, సంపన్నత, జానపద వ్యవహారాలు కూడా సంస్కృతిగా భావింపబడుతాయి. [5] వస్తువుల వినియోగమే కాకుండా ఆటి ఉత్పత్తి విధానం, వాటిని గురించిన దృక్పధం, సమాజంలో ఆ వస్తువులతోపాటు పెనవేసుకొని పోయిన సంబంధాలు, ఆచారాలు కూడా సంస్కృతిలోనివే అని మానవ శాస్త్రజ్ఞులు భావిస్తారు. కనుక కళలు, విజ్ఞానం, నైతికత కూడా సంస్కృతేనని వీరి అభిప్రాయం.

1874లో సామాజిక పురా శాస్త్రము గురించి వ్రాస్తూ టైలర్ సంస్కృతిని ఇలా వర్ణించాడు - "సంస్కృతి" లేదా "నాగరికత"ను విస్తారమైన జాతిపరమైన అంశంగా భావిస్తే, ఆ జాతి లేదా సమాజపు సంక్లిష్టమైన జ్ఞానం, విశ్వాసాలు, కళలు, నైతికత, చట్టం, ఆచారాలు మరియు సమాజంలో భాగస్తుడైనందున వ్యక్తికి సంక్రమించే అలవాట్లు, నైపుణ్యత, అవకాశం - అన్నింటినీ కలిపి సంస్కృతి అనవచ్చును. ("సంస్కృతి లేదా నాగరికత, దాని విస్తృత ఎథ్నోగ్రాఫిక్ కోణంలో తీసుకున్న, జ్ఞానం, నమ్మకం, కళ, నీతులు, చట్టం, ఆచారం కలిగి సంక్లిష్ట మొత్తంగా ఉంటుంది మరియు ఏ ఇతర సామర్థ్యాలు మరియు అలవాట్లు సమాజంలో సభ్యుడిగా మనిషికి సొంతం") [6]

ఐక్య రాజ్య సమితి విద్యా విజ్ఞాన సాంస్కృతిక సంస్థ ( యునెస్కో) వారు సంస్కృతిని ఇలా వర్ణించారు - ఒక సమాజానికి లేదా సమూహానికి చెందిన ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, లౌకిక, వైజ్ఞానిక, బావోద్వేగ అంశాలు ఆ సమాజపు (సమూహపు) సంస్కృతి అవుతాయి. కళలు, జీవన విధానం, సహజీవనం, విలువలు, సంప్రదాయాలు, విశ్వాసాలు ఈ సంస్కృతిలోని భాగాలే. [7] ఇంకా సంస్కృతిని చాలా విధాలుగా విర్వచించారు. 1952లో ఆల్ఫ్రెడ్ క్రోబర్ మరియు క్లైడ్ క్లుఖోన్ అనే రచయితలు తమ [8] సంకలనంలో "సంస్కృతి"కి 164 నిర్వచనాలను సేకరించారు

Other Languages
English: Culture
हिन्दी: संस्कृति
ಕನ್ನಡ: ಸಂಸ್ಕೃತಿ
தமிழ்: பண்பாடு
മലയാളം: സംസ്കാരം
Afrikaans: Kultuur
Alemannisch: Kultur
አማርኛ: ባሕል
aragonés: Cultura
العربية: ثقافة
ܐܪܡܝܐ: ܡܪܕܘܬܐ
مصرى: ثقافه
অসমীয়া: সংস্কৃতি
asturianu: Cultura
Aymar aru: Yati
azərbaycanca: Mədəniyyət
башҡортса: Мәҙәниәт
Boarisch: Kuitua
žemaitėška: Koltūra
беларуская: Культура
беларуская (тарашкевіца)‎: Культура
български: Култура
भोजपुरी: संस्कृति
বাংলা: সংস্কৃতি
བོད་ཡིག: རིག་གནས།
বিষ্ণুপ্রিয়া মণিপুরী: সংস্কৃতি
brezhoneg: Sevenadur
bosanski: Kultura
буряад: Соёл
català: Cultura
Mìng-dĕ̤ng-ngṳ̄: Ùng-huá
Cebuano: Kultura
Chamoru: Kuttura
کوردی: چاند
čeština: Kultura
kaszëbsczi: Kùltura
Чӑвашла: Культура
Cymraeg: Diwylliant
dansk: Kultur
Deutsch: Kultur
Zazaki: Portal:Zagon
ދިވެހިބަސް: ސަގާފަތު
Ελληνικά: Κουλτούρα
Esperanto: Kulturo
español: Cultura
eesti: Kultuur
euskara: Kultura
estremeñu: Coltura
فارسی: فرهنگ
suomi: Kulttuuri
Võro: Kultuur
français: Culture
Nordfriisk: Kultuur
furlan: Culture
Frysk: Kultuer
Gaeilge: Cultúr
galego: Cultura
Avañe'ẽ: Arandupy
Gaelg: Cultoor
客家語/Hak-kâ-ngî: Vùn-fa
עברית: תרבות
Fiji Hindi: Sanskriti
hrvatski: Kultura
Kreyòl ayisyen: Kilti
magyar: Kultúra
Հայերեն: Մշակույթ
interlingua: Cultura
Bahasa Indonesia: Budaya
Interlingue: Cultura
Ilokano: Kultura
Ido: Kulturo
íslenska: Menning
italiano: Cultura
日本語: 文化
Patois: Kolcha
la .lojban.: kulnu
Basa Jawa: Budaya
ქართული: კულტურა
қазақша: Мәдениет
kalaallisut: Kulturi
ភាសាខ្មែរ: វប្បធម៌
한국어: 문화
къарачай-малкъар: Культура
कॉशुर / کٲشُر: تَہزیٖب
Kurdî: Çand
Кыргызча: Маданият
Latina: Cultura
Ladino: Kultura
Lëtzebuergesch: Kultur
Limburgs: Cultuur
lietuvių: Kultūra
latviešu: Kultūra
Basa Banyumasan: Budaya
Malagasy: Kolontsaina
олык марий: Тӱвыра
македонски: Култура
монгол: Соёл
मराठी: संस्कृती
Bahasa Melayu: Budaya
Malti: Kultura
Mirandés: Cultura
မြန်မာဘာသာ: ယဉ်ကျေးမှု
مازِرونی: فرهنگ
Napulitano: Cultura
Plattdüütsch: Kultur
Nedersaksies: Kultuur
नेपाली: संस्कृति
नेपाल भाषा: तजिलजि
Oshiwambo: Hastangi
Nederlands: Cultuur
norsk nynorsk: Kultur
norsk: Kultur
Novial: Kulture
occitan: Cultura
Livvinkarjala: Kul'tuuru
ਪੰਜਾਬੀ: ਸੱਭਿਆਚਾਰ
Papiamentu: Kultura
Pälzisch: Kuldur
polski: Kultura
پنجابی: کلچر
پښتو: هڅوب
português: Cultura
Runa Simi: Kawsay saphi
română: Cultură
русский: Культура
русиньскый: Култура
саха тыла: Култуура
sicilianu: Cultura
Scots: Cultur
سنڌي: ثقافت
srpskohrvatski / српскохрватски: Kultura
Simple English: Culture
slovenščina: Kultura
chiShona: Tsika
Soomaaliga: Dhaqan
shqip: Kultura
српски / srpski: Култура
SiSwati: Inhlonipho
Seeltersk: Kultuur
Basa Sunda: Budaya
svenska: Kultur
Kiswahili: Utamaduni
тоҷикӣ: Фарҳанг
Tagalog: Kalinangan
Türkçe: Kültür
Xitsonga: Ndzhavuko
татарча/tatarça: Мәдәният
українська: Культура
اردو: ثقافت
oʻzbekcha/ўзбекча: Madaniyat
vèneto: Cultura
vepsän kel’: Kul'tur
Tiếng Việt: Văn hóa
Winaray: Kultura
吴语: 文化
მარგალური: კულტურა
ייִדיש: קולטור
Yorùbá: Àṣà
Zeêuws: Cultuur
中文: 文化
Bân-lâm-gú: Bûn-hoà
粵語: 文化