షారుఖ్ ఖాన్

షారుఖ్ ఖాన్ (జననం 2 నవంబరు 1965)  ప్రముఖ భారతీయ సినీ నటుడు, నిర్మాత టివీ ప్రముఖుడు. అభిమానులు ఆయనను బాద్షా ఆఫ్ బాలీవుడ్, కింగ్ ఖాన్ అని పిలుస్తారు. షారూఖ్ దాదాపు 80 సినిమాల్లో నటించారు. ఆయన 14 ఫిలింఫేర్ పురస్కారాలు అందుకున్నారు. ఆసియాలో షారూఖ్ చాలా ప్రముఖుడైన నటుడు. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఎక్కువ నివసించే ప్రదేశాల్లో కూడా ఆయన చాలా ప్రసిద్ధుడు. అభిమానుల సంఖ్య, వసూళ్ళు లెక్కలో షారూఖ్ ప్రపంచంలోని అత్యంత సక్సెస్ ఫుల్ ఫిలిం స్టార్ లలో ఒకరిగా  నిలిచారు.[1][2][3]

1980వ దశకం చివర్లో టివి సీరియల్స్ ద్వారా కెరీర్ ప్రారంభించారు షారూఖ్. 1992లో దీవానా సినిమాతో బాలీవుడ్ తెరంగేట్రం చేశారు ఆయన. కెరీర్ మొదట్లో దార్ర్ (1993), బాజిగర్ (1993),  అంజామ్ (1994) వంటి సినిమాల్లో ప్రతినాయక పాత్రలు పోషించారు. ఆ తరువాత వచ్చిన రొమాంటిక్  కామెడీ సినిమాలు దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే (1995), దిల్ తో పాగల్ హై (1997), కుచ్ కుచ్ హోతా హై (1998), మొహొబ్బతే (2000), కభీ ఖుషీ కభీ గమ్ (2001) సినిమాలతో హీరోగా ఉన్నత శిఖరాలందుకున్నారు షారుఖ్. దేవదాస్ (2002), స్వదేశ్ (2004), చక్ దే! ఇండియా (2007), మై నేమ్ ఈజ్ ఖాన్ (2010) సినిమాల్లో ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఆయన నటించిన కామెడీ సినిమాలు చెన్నై ఎక్స్‌ప్రెస్ (2013), హ్యాపీ న్యూ ఇయర్ (2014) సినిమాలో అతి ఎక్కువ వసూళ్ళు సాధించిన సినిమాలుగా నిలిచాయి. ఆయన సినిమాల్లో దేశభక్తి, సామాజిక సమస్యల గురించి ఎక్కువగా చర్తిస్తారు. సినిమాల్లో చేసిన కృషికిగానూ భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీతోనూ,  ఫ్రాన్స్ ప్రభుత్వం ఒర్డరే డెస్ ఆర్ట్స్ ఎట్ దెస్ లెట్టర్స్, లెగియన్ డి ' హానర్ పురస్కారలతో గౌరవించాయి.

ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్ కు ఆయన సహ చైర్మన్ గానూ, ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోని కోల్‌కత నైట్ రైడర్స్ టీంకు సహ యజమానిగా ఉన్నారు. ఆయన ఇప్పటికీ టీవీ షోలలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంటారు. ఎన్నో వ్యవస్థాపక వెంచర్లు చేస్తున్నందున మీడియా ఆయనను "బ్రాండ్ ఎస్.ఆర్.కె"గా వ్యవహరిస్తుంటుంది. అనారోగ్యాల అవగాహన ప్రచారంలోనూ, విపత్తులు సంభవించినప్పుడు ఆయన దాతృత్వం చెప్పుకోదగ్గది. పిల్లల చదువు ఆవశ్యకతా ప్రచారంలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా 2011లో  యునెస్కో పిరమిడ్ కాచ్ మర్నీ పురస్కారంతో గౌరవించింది.  ప్రభావవంతమైన భారతీయునిగా ఎన్నో పత్రికల చిట్టాల్లో ఎన్నోసార్లు ఉన్నారు షారుఖ్. 2008లో న్యూస్ వీక్ పత్రిక ప్రపంచంలోని 50 అత్యంత పవర్ ఫుల్ వ్యక్తుల జాబితాలో ఆయనను ప్రస్తావించింది.

Other Languages
മലയാളം: ഷാരൂഖ് ഖാൻ
Afrikaans: Shah Rukh Khan
አማርኛ: ሻህሩኽ ኻን
aragonés: Shah Rukh Khan
العربية: شاه روخ خان
অসমীয়া: শ্বাহৰুখ খান
azərbaycanca: Şahrux Xan
беларуская: Шах Рух Хан
български: Шах Рук Хан
भोजपुरी: शाहरुख खान
brezhoneg: Shahrukh Khan
català: Shahrukh Khan
нохчийн: ШахӀ Рух Хан
کوردی: شاروخ خان
čeština: Shahrukh Khan
डोटेली: शाहरूख खान
ދިވެހިބަސް: ޝާހުރުކް ޚާން
Ελληνικά: Σαχ Ρουκ Κχαν
Esperanto: Shahrukh Khan
español: Shahrukh Khan
euskara: Shahrukh Khan
فارسی: شاهرخ خان
français: Shahrukh Khan
गोंयची कोंकणी / Gõychi Konknni: Shah Rukh Khan
ગુજરાતી: શાહરૂખ ખાન
Fiji Hindi: Shah Rukh Khan
հայերեն: Շահրուխ Խան
Bahasa Indonesia: Shah Rukh Khan
italiano: Shah Rukh Khan
Basa Jawa: Shahrukh Khan
ქართული: შაჰ რუხ ხანი
қазақша: Шахрух Хан
한국어: 샤루크 칸
कॉशुर / کٲشُر: شاہ رخ خان
Кыргызча: Шахрух Кхан
Lëtzebuergesch: Shahrukh Khan
لۊری شومالی: شا رخ خان
lietuvių: Shah Rukh Khan
latviešu: Šāhruhs Hāns
मैथिली: शाहरूख खान
монгол: Шарук Кан
Bahasa Melayu: Shah Rukh Khan
မြန်မာဘာသာ: ရှရွတ်ခန်း
नेपाली: शाहरूख खान
Nederlands: Shahrukh Khan
پنجابی: شاہ رخ خان
português: Shahrukh Khan
Runa Simi: Shahrukh Khan
română: Shah Rukh Khan
русский: Хан, Шахрух
संस्कृतम्: शाहरूख खान
srpskohrvatski / српскохрватски: Shahrukh Khan
Simple English: Shahrukh Khan
Soomaaliga: Shahrukh Khan
svenska: Shahrukh Khan
тоҷикӣ: Шоҳрух Хон
Türkçe: Shahrukh Khan
українська: Шахрух Хан
oʻzbekcha/ўзбекча: Shahrukh Khan
vepsän kel’: Han Šahruh
Tiếng Việt: Shahrukh Khan
მარგალური: შაჰ რუხ ხანი
粵語: 沙魯克汗