విభజించి పాలించు

సంప్రదాయికంగా ఈ సిద్ధాంతం మేసిడోనియా యొక్క ఫిలిప్ రాజు ప్రారంభించారని భావిస్తారు.

రాజనీతి శాస్త్రం, సామాజిక శాస్త్రాల్లో విభజించు, పాలించు (లేదా విభజించు, ఓడించు, లాటిన్ లో డివైడ్ ఎట్ ఇంపెరా(dīvide et īmpera)) అంటే అతిపెద్ద అధికార కేంద్రాన్ని చిన్న చిన్న విభాగాలుగా విడగొట్టి చిన్న చిన్న విభాగాలు మొత్తం ఏక కేంద్రం కన్నా బలహీనం అయ్యాకా అధికారం, శక్తి సాధించడం, దాన్ని నిలబెట్టుకోవడం. ఈ యుక్తి ప్రస్తుతం నెలకొన్న అధికార క్రమాన్ని విచ్ఛిన్నపరిచి, ప్రత్యేకించి తద్వారా ఏర్పడ్డ చిన్న చిన్న శక్తులు ఒకదానితో మరొకటి కలిసి బలపడకుండా నిరోధించడం, ప్రజలు, గుంపుల మధ్య శత్రుత్వాలు ఏర్పరిచి వారిని విభజించడం వంటివాటిని కలిగివుంటుంది.

ఇటాలియన్ రచయిత ట్రైయనో బొకాలిని లా బిలన్సియా పొలిటికా గ్రంథంలో డివైడ్ ఎట్ ఇంపెరా (విభజించి పాలించు) అన్నది రాజకీయాల్లో సాధారణ సూత్రమని పేర్కొన్నారు. కలసివుంటే తన అధికారాన్ని, పరిపాలనను ఎదిరించగల పాలితులు, ప్రజలు లేదా వివిధ ఆసక్తులు గల విభాగాలను నియంత్రించేందుకు సార్వభౌమాధికారాన్ని బలపరచడం ఈ సూత్రం ప్రధాన ఉద్దేశం. మేకియవెల్లి తన నాలుగో పుస్తకం యుద్ధ కళ (డెల్లార్టె డెల్లా గుయెర్రా)లో దీన్ని పోలిన యుద్ధ తంత్రాన్ని చెప్తారు,[1][2] దాని ప్రకారం సేనాని శత్రువు శక్తిని విడదీసి వేర్వేరు పనుల్లో వ్యస్తమయ్యేలా చేయగల ప్రతి అంశంలోనూ సామర్థ్యం సాధించాలి, తన మనుషులపైనే అతనికి అనుమానాన్ని కలిగించడమో, ఏదో కారణంతో తన సైన్యంలోని భాగాన్ని వేరే వైపుకు పంపించాల్సి రావడమో కావచ్చు, తద్వారా అతను మరింత బలహీనుడవుతాడు.

మాగ్జిం డివైడ్ ఎట్ ఇంపెరా అన్న ఈ సిద్ధాంతానికి మూలపురుషునిగా మాసిడోన్ యొక్క రెండవ ఫిలప్ రాజును గుర్తించగా, దానితో పాటుగా మాగ్జిం డివైడ్ అట్ రెగ్నెస్ లను రోమన్ పరిపాలకుడు జూలియస్ సీజర్ మరియు ఫ్రెంచి చక్రవర్తి నెపోలియన్  బాగా వినియోగించుకున్నారు.

Other Languages