విటమిన్ ఎ

రెటినాల్ రసాయనిక నిర్మాణం.

విటమిన్ A రసాయన నామం 'రెటినాల్'. దినిని ఆంటీ జీరాప్తల్మిక్ విటమిన్ అనికూడా అంటారు.

ఇదిగా చేప కాలేయపు నూనె, పాలు, వెన్న, గుడ్డు సొన మొదలైన వాటిలో ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువగా కారట్, ఆకుకూరలలో ఉంటుంది. మొక్కలలో ఇది బీటా-కెరోటిన్ రూపంలో ఉంటుంది. ఇది కాలేయం, పేగులలో విటమిన్ A గా మారుతుంది.

ఉపకళా కణజాలాలు ఉత్తేజితంగా ఉండటానికి, పెరుగుదలకు, కంటి చూపు మామూలుగా ఉంచడంలో విటమిన్ A ముఖ్య పాత్ర వహిస్తుంది. కంటి నేత్రపటలంలో రోడాప్సిన్ పునః సంశ్లేషణకు ఇది అత్యావసరం.

విటమిన్ A లోపంవల్ల రేచీకటి, జిరాఫ్తాల్మియా, కెరటోమలేసియా కలుగుతాయి.

---విటమిన్ 'ఎ' లోపం వల్ల కలిగే వ్యాధులు---

¤ రేచీకటి/ నైట్ బ్త్లెండ్‌నెస్/ నిక్టలోపియా: ఈ వ్యాధితో బాధపడేవారు తక్కువ వెలుతురులో, రాత్రిపూట వస్తువులను చూడలేరు.

¤ జీరాఫ్‌థాల్మియా / పొడికళ్లు: కంటిలోని అశ్రుగ్రంథులు అశ్రువులను ఉత్పత్తి చేయవు. ఫలితంగా కంటిపొర(కంజెక్టివా) పొడిగా అవుతుంది.

¤ పోషకాహార అంధత్వం: పిల్లల్లో పోషకాహార (విటమిన్ ఎ) లోపం వల్ల కంటి ముందుభాగంలో ఉండే శుక్లపటలం (కార్నియా) అనే పారదర్శకమైన పొర మెత్తగా అయ్యి, పగులుతుంది. దీనివల్ల దృష్టి పోయి శాశ్వత అంధత్వం కలుగుతుంది.

¤ చర్మం పొలుసుల్లా, గరుకుగా చిన్న చిన్న సూక్ష్మాంకురాలతో కప్పబడి, గోదురకప్ప చర్మంలా కనిపిస్తుంది.

¤ విటమిన్ 'ఎ' లోపం ప్రత్యుత్పత్తి చర్యల మీద కూడా ప్రభావం చూపుతుంది.

¤ కలర్ బ్త్లెండ్‌నెస్ / వర్ణ దృష్టిలోపం: రెటీనాలోని కోన్‌లలో ఉండే దృష్టి వర్ణకాల లోపం వల్ల ఎరుపు, ఆకుపచ్చ రంగుల మధ్య తేడాలను గుర్తించలేరు.శరీరంలో విటమిన్ 'ఎ'ను 6 నుంచి 9 నెలల వరకు నిల్వచేయవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకొని జాతీయ పోషకాహార సంస్థ (NIN, హైదరాబాద్) విటమిన్ 'ఎను పాఠశాలల్లో చదివే పిల్లలకోసం ప్రతి ఆర్నెళ్లకోసారి పెద్దమొత్తాల్లో సరఫరా చేస్తుంది.

¤ విటమిన్ 'ఎ'ను 'యాంటీ జిరాఫ్తాల్మిక్ విటమిన్ / జీరాఫ్తాల్మియా నివారక విటమిన్' అని కూడా పిలుస్తారు.

Other Languages
English: Vitamin A
हिन्दी: विटामिन ए
ಕನ್ನಡ: ಎ ಜೀವಸತ್ವ
മലയാളം: ജീവകം എ
Afrikaans: Vitamien A
العربية: فيتامين ألف
asturianu: Vitamina A
azərbaycanca: A vitamini
bosanski: Vitamin A
català: Vitamina A
čeština: Vitamín A
Cymraeg: Fitamin A
dansk: Vitamin A
Deutsch: Vitamin A
ދިވެހިބަސް: ވިޓަމިން އޭ
Esperanto: Vitamino A
español: Vitamina A
eesti: A-vitamiin
euskara: A bitamina
فارسی: ویتامین آ
føroyskt: A vitamin
français: Vitamine A
galego: Vitamina A
עברית: ויטמין A
hrvatski: Vitamin A
magyar: A-vitamin
Bahasa Indonesia: Vitamin A
íslenska: A-vítamín
日本語: ビタミンA
la .lojban.: abumoi mivytcuxu'i
Basa Jawa: Vitamin A
ქართული: ვიტამინი A
한국어: 비타민 A
Lingua Franca Nova: Vitamina A
lietuvių: Vitaminas A
latviešu: A vitamīns
македонски: Витамин А
монгол: Витамин А
Bahasa Melayu: Vitamin A
नेपाली: भिटामिन ए
norsk: Vitamin A
occitan: Vitamina A
ଓଡ଼ିଆ: ଜୀବସାର କ
ਪੰਜਾਬੀ: ਵਿਟਾਮਿਨ ਏ
polski: Witamina A
português: Vitamina A
русский: Витамин A
Kinyarwanda: Vitamini A
sicilianu: Vitamina A
Scots: Vitamin A
srpskohrvatski / српскохрватски: Vitamin A
සිංහල: විටමින් A
Simple English: Vitamin A
slovenščina: Vitamin A
shqip: Vitamina A
Kiswahili: Vitamini A
Türkçe: A vitamini
татарча/tatarça: A витамины
тыва дыл: Витамин A
ئۇيغۇرچە / Uyghurche: ۋىتامىن A
українська: Вітамін A
Tiếng Việt: Vitamin A
吴语: 维生素A
中文: 維生素A