వికీపీడియా:ఏకాభిప్రాయం

ఏకాభిప్రాయం వికీపీడియాలో నిర్ణయాలు తీసుకోవటానికి ఉపయోగించబడే ప్రధాన మార్గం. ఇది మన లక్ష్యాన్ని అనగా వికీపీడియా లక్ష్యాన్ని చేరటానికి అత్యుత్తమమైన మార్గంగా ఆమోదించబడింది. వికీపీడియాలో ఏకాభిప్రాయం అనగా ఏకగ్రీవం కాదు. ఏకగ్రీవం శ్రేయస్కరణమైనా అది సాధించటం అన్ని సందర్భాలలో వీలుపడదు. అలాగే ఏకాభిప్రాయం ఓటింగు ప్రక్రియ యొక్క ఫలితం కూడా కాదు. నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో వికీపీడియా యొక్క విధానాలను మరియు మార్గదర్శకాలను గౌరవిస్తూ, వాటిని దృష్టిలో పెట్టుకుంటూనే, అందరు వికీపీడియా వాడుకరుల యొక్క సహేతుకమైన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ముందుకు సాగే ప్రక్రియ జరగాలి.

ఈ విధానం వికీపీడియా పరిధిలో ఏకాభిప్రాయాన్ని వివరిస్తుంది. ఏకాభిప్రాయం ఏర్పడిందో లేదో అన్న విషయం ఎలా నిర్ణయించాలో, ఏకాభిప్రాయం కుదరకపోతే ఆ విషయంపై ఎలా ముందుకు వెళ్లాలో కూడా తెలియజేస్తుంది. అన్ని నిర్ణయాలు ఏకాభిప్రాయం ద్వారానే తీసుకోవాలనే విధానానికి ఉన్న వెసలుబాట్లను వివరిస్తుంది.

Other Languages
azərbaycanca: Vikipediya:Konsensus
беларуская (тарашкевіца)‎: Вікіпэдыя:Кансэнсус
interlingua: Wikipedia:Consenso
Bahasa Indonesia: Wikipedia:Konsensus
srpskohrvatski / српскохрватски: Wikipedia:Konsenzus
Simple English: Wikipedia:Consensus
slovenščina: Wikipedija:Soglasje
татарча/tatarça: Википедия:Консенсус
oʻzbekcha/ўзбекча: Vikipediya:Konsensus