వాలెంతినా తెరిష్కోవా

వాలెంతినా తెరిష్కోవా
వాలెంతినా తెరిష్కోవా

1969 లో వాలెంతినా తెరిష్కోవా

సోవియట్ వ్యోమగామి
అంతరిక్షంలొ ప్రవేశించిన మొదటి మహిళ
జాతీయతసోవియట్ యూనియన్
రష్యన్
జననం
ఇతర వృత్తులువ్యోమగామి
ర్యాంక్మేజర్ జనరల్, సోవియట్ ఎయిర్‌ఫోర్స్
అంతరిక్షంలో గడిపిన కాలం2 రోజులు, 23 గంటల and 12 నిమిషాలు
ఎంపికమహిళా దళం
మిషన్వోస్తోక్ 6

వాలెంతినా తెరిష్కోవా రష్యాకు మరియు పూర్వపు సోవియట్ యూనియన్ కు చెందిన వ్యోమగామి. ఆమె మార్చి 6, 1937 న జన్మించింది. ఈమె అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి మహిళగా చరిత్రలో ప్రసిద్ధికెక్కింది. ఆమె జూన్ 16,1963 న అంతరిక్షంలోకి వెళ్ళుటకు ప్రయోగించిన వోస్కోట్-6 అనే అంతరిక్ష నౌకకు పైలెట్ గా నాలుగు వందలమంది దరఖాస్తుదారులలో ఒకరిగా ఎంపికైనది. అంతరిక్ష సంస్థ లోకి అడుగు పెట్టిన తెరిస్కోవా సోవియట్ వాయుసేనా దళంలో మొదటి సారిగా గౌరవప్రథమైన హోదాలో ఉండెడిది. ఆమె అంతరిక్షంలోనికి వెళ్ళిన మొదటి మహిళా పైలట్ గా ప్రసిద్ధి చెందింది.[1] ఆమె మూడు రోజుల అంతరిక్ష యాత్రలో అనేక స్వీయ పరీక్షలను నిర్వహించుకొని ఆమె స్త్రీల శరీరంలో గల మార్పులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించింది.

తెరిస్కోవా అంతరిక్ష వ్యోమగామిగా నియామకం కాకముందు ఆమె జౌళి పరిశ్రమలో పనిచేసింది. అమె పారాచూట్ లపట్ల ఆసక్తి కనబరచేది. 1969 లో వ్యోమగాముల మొదటి సమూహం విడిపోయిన తర్వాత ఆమె కమ్యూనిటీ పార్టీ ఆఫ్ సోవియట్ యూనియన్ లో గౌరవ సభ్యులుగా ఎంపిక కాబడ్డారు. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత ఆమె ప్రస్తుతం గల సోవియట్ రష్యాలో పూజ్యమైన స్త్రీగా గుర్తింపబడుతున్నారు.

Other Languages
azərbaycanca: Valentina Tereşkova
Bikol Central: Valentina Tereshkova
беларуская (тарашкевіца)‎: Валянціна Церашкова
Bahasa Indonesia: Valentina Tereshkova
لۊری شومالی: والنتینا ترشکوا
Bahasa Melayu: Valentina Tereshkova
norsk nynorsk: Valentina Teresjkova
Simple English: Valentina Tereshkova
slovenščina: Valentina Tereškova
татарча/tatarça: Валентина Терешкова
oʻzbekcha/ўзбекча: Valentina Tereshkova
vepsän kel’: Tereškova Valentina