రాబర్టు క్లైవు

Major-General the Right Honourable
రాబర్టు క్లైవు
The Lord Clive

KB  FRS
Robert Clive, 1st Baron Clive by Nathaniel Dance, (later Sir Nathaniel Dance-Holland, Bt).jpg
Lord Clive in military uniform. The Battle of Plassey is shown behind him.
Portrait by Nathaniel Dance
Governor of the Presidency of Fort William
కార్యాలయంలో
1757–1760
అంతకు ముందువారు Roger Drake
as President
తరువాత వారు Henry Vansittart
కార్యాలయంలో
1765–1766
అంతకు ముందువారు Henry Vansittart
తరువాత వారు Harry Verelst
వ్యక్తిగత వివరాలు
జననం (1725-09-29)29 సెప్టెంబరు 1725
Styche Hall, Market Drayton, Shropshire, ఇంగ్లండు
మరణం 22 నవంబరు 1774(1774-11-22) (వయసు 49)
Berkeley Square, Westminster, లండన్
జాతీయత బ్రిటిష్
పూర్వవిద్యార్థి Merchant Taylors' School
Military service
Nickname(s) Clive of India
Allegiance   Kingdom of Great Britain / British Empire
Service/branch   యు.కే.
Years of service 1746–1774
Rank మేజర్-జనరల్
Unit బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ
Commands Commander-in-Chief of India
Battles/wars War of the Austrian Succession
Battle of Madras
కర్ణాటక యుద్ధాలు
Siege of Arcot
Battle of Arnee
Battle of Chingleput
Seven Years' War
Battle of Chandannagar
Battle of Plassey
పురస్కారాలు KB

క్రీ.శ 1599 లో ఇంగ్లండులో ఈస్టిండియా కంపెనీగా స్ధాపింపబడి 1600 సంవత్సరంలో పట్టాపుచ్చుకుని వ్యాపారంచేసుకోటానికి భారతదేశానికి వచ్చిన బ్రిటిష్ ఈస్టుఇండియా వర్తక కంపెనీను బ్రిటిష్ ఇండియాగా జేయుటకు పునాదులు వేసిన రాజ్యతంత్రజ్ఞుడు రాబర్టు క్లైవు. ఈ దేశ భాగబోగ్యములను ఇంగ్లండుకు తరలించుటకు మార్గము చూపినదీ నితడే. భారతదేశములోని వంగరాష్ట్రము అతని కర్మభూమిగా చెప్పవచ్చును. రాబర్టు క్లైవు జీవిత కాలం 1725-1774. అధికార కార్యకాలం 1743-1767. కీలుబొమ్మలుగా నుండేవారిని నవాబుగా సింహాసనాధిష్ఠానంచేసి నాటకమాడి రాజ ఖజానాలలోని ధన సంపత్తిని ఇంగ్లండుకు పంపిచే మార్గం, బ్రిటిష్ రాజ్యస్థాపనకు క్లైవు చూపినదారి. వంగరాష్ట్ర స్వాధీనంచేసుకోటంలో అవలంబించిన రాజ్యతంత్రమూ, తదుపరి 3 సంవత్సరములు పరిపాలనలో,కార్యాచరణలో క్లైవు దొర అవలంబించిన రాజనీతి వల్ల వంగరాష్ట్రములో అవినీతి,దుష్టపరిపాలన ప్రజాపీడనలతోకూడిన విషమస్థితికి దారితీసినదని ఇంగ్లండులో నెలకొల్పిన రెండు పార్లమెంటు కమిటీలు విచారణ జరిపి తేల్చిన వాస్తవం. ఆనాటి వంగరాష్ట్రం లోకలిగిన ప్రజల దుస్థితికి కారణమైన లంచగోండితనం, ప్రజా పీఢనము,కంపెనీ ఉద్యోగుల స్వంత వ్యాపారాలు లంచ గొండి తనమేననీను, కంపెనీఉద్యోగుల జీతములు చాలకపోబట్టి లంచగొండితనమునకు పాల్పడుచున్నారనియూ క్లైవు దొరగారే వారి కంపెనీ డైరక్టర్లకు 1765 సెప్టెంబరు 30తేది వ్రాసిన లేఖలో వాపోయినా అనేక సంస్కరణ చర్యలు చేపట్టినా చివరకు క్లైవు దొర వ్యక్తిగతముగాను, ఆయన కార్యకాలమునూ బాధ్యులగా గుర్తించి 1773లో బ్రిటిష్ కామన్సు సభలో విశ్వాసరాహిత్య తీర్మానము నేరారోపణ తీవ్రచర్చ జరిగింది. [1]. [2]. రాబర్టు క్లైవు, అతని కుమారుడు ఎడ్వర్డు క్లైవు భారతదేశములో బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెనీ ఉద్యోగ పదవులు నిర్వహించిన కార్యకాలంలో వారు అక్రమంగా కూడబెట్టుకుని ఇంగ్లండుకు చేరవేసుకున్న అనేక భారతీయ అమూల్యవస్తువులు ఇప్పటికీ వేల్సు పొవిస్ కోట (POWIS CASTLE IN WALES) లో క్లైవు చిత్రవస్తు ప్రదర్శన శాల (The Clive Museum)లో నున్నటుల తెలియుచున్నది. [3]

వ్యక్తిగత జీవిత ముఖ్యాంశాలు

రాబర్టు క్లైవు ఇంగ్లండులోని (Shropshire) షోర్ప్ షీర్ లో సెప్టంబరు 29, 1725 జన్మించెను. వివిధ స్కూళ్ళలో చదివి 18 వ ఏటనే బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీలో గుమాస్తా (బుక్ కీపరు)గా 1743 లో భారతదేశానికి వచ్చాడు. తరువాత 1746లో ఫ్రెంచివారితో జరిగిన యధ్ధములో అతని సైనిక కౌశల్యం గుర్తింపబడగా సివిల్ ఉద్యోగమునుండి సైనికోద్యోగిగా మారాడు. 1749 లో సైనిక సిబ్బంది ఆహార సామగ్రీ సప్లై అధికారిగానియమించబడ్డాడు. 1753 లో Margaret Maskelyne తో వివాహం అయిన కొద్దిరోజులకు మొదటి విడుత కార్యకాలం (1748-1753) పూర్తిచేసుకుని గొప్ప కీర్తి సంపదలతో మార్చి1753లో ఇంగ్లండుకి వెళ్లిపోయాడు.రెండవ విడుతగా 1755 లో చెన్నపట్నంలోని బ్రిటిష్ వారి దేవీకోట (Fort Saint David) కు గవర్నరు గానూ, లెఫ్టినెంటు కర్నలు (Lt.COLONEL)పదవీహోదాతోనూ వచ్చి రెండవ విడుత కార్యకాలం (1755-1760) పూర్తిచేసుకు ఫిబ్రవరి 1760 లో ఇంగ్లండుకు మరింత కీర్తి, సంపత్తితో తిరగి వెళ్ళాడు. ఇంగ్లండులో తన స్వదేశ రాజకీయలలో ప్రముఖస్తానంకోసం ఇండియాలో వంగరాష్ట్రములో సంపాదించిన సంపత్తిని వినియోగించి బ్రిటిష్ పార్లమెంటులో సభ్యత్వంకోసం ప్రయత్నించాడు. 1762 లో బరాన్ క్లైవు ప్లాసీ (BARON CLIVE OF PLASSEY) అను బిరుదునూ, 1764 లో K B అనే బ్రటిష్ వారి గొప్ప పురస్కారం (Knighthood Ribbon of a Knight Bachelor) తోనూ సన్మానితుడై మూడవ విడతగా 1765 లో వచ్చాడు.1765 మూడవ విడతగా వచ్చింది కంపెనీ గవర్నరుగానే వచ్చాడు. అయితే ఈ సారివచ్చినది 1760-1765 లమధ్యకాలం తను లేనప్పడు భారతదేశములో వంగరాష్ట్రములో ప్రబలవిస్తున్న అవినీతి, ప్రజాపీడన విషమస్థితిని సరిచేయమని పంపగా వచ్చాడు. క్లైవు తనకు అతి ప్రియమైన కోరిక బ్రిటిష్ పార్లమెంటులో సభ్యునిగానగుట చిరవరకు సాధించాడు. ష్రూసబరీ (SHREWSBURY COUNTY) నుండి లండన్ బ్రిటిష్ కామన్సు సభకు (పార్లమెంటుకు) సభ్యుడైనాడు. వంగరాష్ట్రములో క్లైవుపదవీకాలంలో చేకూర్చుకున్న ధన సంపాదన, సంపత్తిల గురించి విచారణ చేయుటకు 1773 లో రెండు పార్లమెంటరీ కమిటీలు ఏర్పరచి విచాారణ జరిపి క్లైవు వంగరాష్ట్ర కార్యకాలం అవినీతి, కంపెనీఉద్యాగుల సొంతవ్యాపారాలు, ప్రజాపీడనలు జరిగినట్టుగా ధ్రువపరచారు. 1773లో బ్రిటిష్ కామన్సు సభలో విశ్వాసరాహిత్య తీర్మానమును క్లైవు తన దేశానికి చేసిన మహోపకార దృష్ట్యా రద్దు చేయబడింది. కానీ 1774 నవంబరు 22 రాబర్టు క్లైవు స్వకృతచర్యతో మరణించాడు. రాబర్టు క్లైవు చేసిన ప్రముఖ కార్యసాధనలు 1751 లో ఆర్కాటును రక్షించటం, 1757 లో చంద్రనగర్ (వంగరాష్ట్రము) పట్టుకుని కలకత్తాను విడిపించటం.

Other Languages