మైక్రోసాఫ్ట్ ఔట్లుక్

Microsoft Outlook
Microsoft Outlook Icon
Microsoft Outlook Screenshot
Outlook 2010 running on Windows Vista
అభివృద్ధిచేసినవారుMicrosoft
సరికొత్త విడుదల2010 (14.0.4760.1000) / జూన్ 15, 2010; 8 సంవత్సరాలు క్రితం (2010-06-15)
నిర్వహణ వ్యవస్థMicrosoft Windows
రకముPersonal information manager
లైసెన్సుProprietary commercial software
Microsoft Outlook for Mac
Microsoft Outlook for Mac Icon
Microsoft Outlook for Mac screenshot
Outlook 2011 running on Mac OS X Snow Leopard
అభివృద్ధిచేసినవారుMicrosoft
సరికొత్త విడుదల2011 (14.0.0.100825) / అక్టోబరు 26, 2010; 8 సంవత్సరాలు క్రితం (2010-10-26)
నిర్వహణ వ్యవస్థMac OS X
రకముPersonal information manager
లైసెన్సుProprietary commercial software

మైక్రోసాఫ్ట్ ఔట్లుక్ స్వతంత్రంగా పనిచేసే వ్యక్తిగత సమాచార‌ మేనేజర్‌ లాంటిది. మైక్రోసాఫ్ట్ సంస్థ దీన్ని తయారుచేసింది. ఇది ప్రత్యేకమైన అప్లికేషన్ గాను, అలాగే మైక్రోసాఫ్ట్ ఆఫీసు సూట్ లోను లభిస్తుంది. ప్రస్తుత మైక్రోసాఫ్ట్ ఔట్లుక్ 2010 వెర్షన్‌ విండోస్‌కి మరియు 2011 మ్యాక్ వెర్షన్‌కి సరిగ్గా సరిపోతుంది.

ఎక్కువగా దీన్ని ఈమెయిల్ అవసరాల కోసమే వాడుతున్నప్పటికీ బహుళ ఉద్దేశ్య‌ కేలెండర్ లక్షణాలు, టాస్క్ మేనేజర్, కాంటాక్ట్‌ మేనేజర్‌, వ్యక్తిగత నోట్స్ రాసుకునేందుకు జర్నల్, వెబ్‌ బ్రౌజింగ్‌ లకు కూడా ఉపయోగపడుతుంది.

ఆఫీస్‌లో ఎలాంటి పనికైనా దాదాపు ఔట్లుక్‌ ఒక్కటే సరిపోతుంది. మైక్రోసాఫ్ట్‌ ఎక్స్‌ఛేంజ్‌ సర్వర్ మైక్రోసాఫ్ట్‌ షేర్‌పాయింట్ సర్వర్‌ లాంటివి వాడుతున్న చోట్ల కూడా వాటితో సమన్వయంతో పనిచేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. అంటే స్వతంత్రంగా అయినా మిగతా ప్రోగ్రామ్స్‌తో కలిసి పనిచేసేందుకైనా మైక్రోసాఫ్ట్‌ ఔట్లుక్ సమర్ధంగా ఉపయోగపడుతుంది. మెయిల్‌ బాక్సులు, క్యాలండర్లు, ఎక్స్‌ఛేంజ్ పబ్లిక్ ఫోల్డర్లు, షేర్‌ పాయింట్‌ జాబితాలు, సమావేశపు వివరాలను పంచుకోవచ్చును. థర్డ్ పార్టీ యాడ్ ఆన్ అప్లికేషన్స్ ఔట్లుక్ ను బ్లాక్ బెర్రీ మొబైల్ ఫోన్లు మరియు ఆఫీసు మరియు స్కైప్ ఇనర్నేట్ సమాచార మార్పిడి వంటి ఇతర సాఫ్ట్వేర్ లతో కూడా అనుసంధానిస్తాయి. ఆఫీస్‌ అవసరాల కోసం సొంతంగా ఏదైనా సాఫ్ట్‌వేర్ తయారు చేసుకున్నా, దాంతో కూడా ఇది అనుసంధానం అయ్యి పనిచేస్తుంది. మైక్రోసాఫ్ట్‌ విజువల్ స్టూడియో లాంటి టూల్స్ వాడుతున్న చోట కూడా ఇది సమర్ధంగా ఉపయోగపడుతుంది.[1] అదనముగా, విండోస్ మొబైల్ పరికరాలు దాదాపుగా అన్ని రకాల ఔట్లుక్ సమాచారాన్ని ఔట్లుక్ మొబైల్ లోకి పంపగలవు.

Other Languages
հայերեն: Microsoft Outlook
Bahasa Indonesia: Microsoft Outlook
Кыргызча: Microsoft Outlook
Nederlands: Microsoft Outlook
português: Microsoft Outlook
русский: Microsoft Outlook
srpskohrvatski / српскохрватски: Microsoft Outlook
Simple English: Microsoft Outlook
српски / srpski: Мајкрософт аутлук
тоҷикӣ: Microsoft Outlook
українська: Microsoft Outlook
Tiếng Việt: Microsoft Outlook