బిట్

బిట్ అనేది కంప్యూటింగ్ మరియు డిజిటల్ కమ్యూనికేషన్లలో సమాచారం యొక్క ప్రాథమిక ప్రమాణం. ఒక బిట్ కేవలం రెండు విలువల్లో ఒకదానిని మాత్రమే సూచించగలదు. అందువలన దీనిని భౌతికంగా రెండు స్థితుల్లో ఉండగల ఏ పరికరంతోనైనా సూచించవచ్చు. ఈ విలువలు సర్వసాధారణంగా 0 తో గాని లేదా 1 తో గాని సూచించబడతాయి. బైనరీ డిజిట్ యొక్క పూర్తి రూపమే బిట్. ఇది సమాచార సిద్ధాంతంలో షానన్ [1] అనే ప్రమాణానానికి సమానం.

ఈ రెండు విలువలను తర్కంలో (లాజిక్) అవును/కాదు, ఉంది/లేదు, సత్యం/అసత్యం; గణితంలో ధన సంఖ్య/ఋణ సంఖ్య; ఏదైనా స్థితిని తెలుపడానికి ఆన్/ఆఫ్ లాంటి వాటిని సూచించడానికి వాడతారు. బిట్లను ప్రమాణంగా సూచించడానికి ఆంగ్లంలో bits లేదా b అని గానీ సూచిస్తారు. సాధారణంగా ఎనిమిది బిట్ల సముదాయాన్ని ఒక బైట్ అని వ్యవహరిస్తారు.

భౌతిక నమూనా

ఒక బిట్ ను ఏదైనా డిజిటల్ పరికరంతో లేదా కేవలం రెండు స్థితుల్లో ఉండగలిగే ఏ భౌతిక పరికరంతోనైనా సూచించవచ్చు. వీటిని సూచించడానికి పలు మార్గాలు ఉన్నాయి. అధునాతన కంప్యూటింగ్ పరికరాలలో దీనిని ఎలక్ట్రికల్ వోల్టేజీ లేదా కరెంటు ప్రవాహంతో సూచిస్తారు.

ప్రసారం, విశ్లేషణ

బిట్లను ఒకదాని తరువాత ఒకటి ప్రసారం చేస్తే దానిని శ్రేణీ ప్రసారం (సీరియల్ ట్రాన్స్ మిషన్) అనీ ఒకేసారి ఒకటికన్నా ఎక్కువ బిట్లు ప్రసారం చేస్తే దానిని సమాంతర ప్రసారం (ప్యారలల్ ట్రాన్స్ మిషన్) అనవచ్చు. డేటా ప్రసార రేటును కొలవడానికి బిట్స్ ఫర్ సెకండ్ (bit/s) లేదా కిలోబిట్స్ ఫర్ సెకండ్ అనే ప్రమాణానాన్ని వాడతారు.

Other Languages
English: Bit
हिन्दी: द्वयंक
ಕನ್ನಡ: ಬಿಟ್
தமிழ்: இருமம்
മലയാളം: ബിറ്റ്
Afrikaans: Bis
aragonés: Bit
Ænglisc: Twāling
العربية: بت
asturianu: Bit
azərbaycanca: Bit
تۆرکجه: بیت
беларуская: Біт
беларуская (тарашкевіца)‎: Біт
বাংলা: বিট
brezhoneg: Bit
bosanski: Bit
català: Bit
کوردی: بیت
čeština: Bit
Cymraeg: Bit
dansk: Bit
Deutsch: Bit
Ελληνικά: Δυαδικό ψηφίο
Esperanto: Bito
español: Bit
eesti: Bitt
euskara: Bit
suomi: Bitti
français: Bit
furlan: Bit
Frysk: Bit
Gaeilge: Giotán
galego: Bit
עברית: סיבית
hrvatski: Bit
magyar: Bit
հայերեն: Բիթ
interlingua: Bit
Bahasa Indonesia: Bit
italiano: Bit
日本語: ビット
ქართული: ბიტი
Qaraqalpaqsha: Bit
한국어: 비트
Кыргызча: Бит (маалымат)
Latina: Bit
Lëtzebuergesch: Bit
lumbaart: Bit
ລາວ: ບິຕ
lietuvių: Bitas
latviešu: Bits
олык марий: Бит
македонски: Бит
монгол: Бит
मराठी: बाईट
Bahasa Melayu: Bit
Malti: Bit
Mirandés: Bit
မြန်မာဘာသာ: Bit
Nederlands: Bit (eenheid)
norsk nynorsk: Bit
norsk: Bit
occitan: Bit
polski: Bit
پنجابی: بٹ
português: Bit
română: Bit
русский: Бит
sicilianu: Bit
Scots: Bit
سنڌي: ٻٽ
srpskohrvatski / српскохрватски: Bit (informatika)
Simple English: Bit
slovenčina: Bit
slovenščina: Bit
shqip: Bit
српски / srpski: Бит (рачунарство)
svenska: Bit
тоҷикӣ: Бит
ไทย: บิต
Türkçe: Bit (bilişim)
українська: Біт
Tiếng Việt: Bit
Winaray: Bit
吴语: 柲 (单位)
ייִדיש: ביט
中文: 位元
Bân-lâm-gú: Bit
粵語: 位元