ఫ్రాంజ్ కాఫ్కా

ఫ్రాంజ్ కాఫ్కా
Black-and-white photograph of Kafka as a young man with dark hair in a formal suit
1906లో ఫ్రాంజ్ కాఫ్కా
జననం(1883-07-03) 1883 జూలై 3
ప్రాగ్, బొహీమియా, ఆస్ట్రియా-హంగరీ
(ఇప్పటి చెక్ రిపబ్లిక్)
మరణం1924 జూన్ 3 (1924-06-03)(వయసు 40)
క్లోస్టెర్న్యూబర్గ్, దిగువ ఆస్ట్రియా, ఆస్ట్రియా
పౌరసత్వంఆస్ట్రియా-హంగరీ, జెకోస్లోవేకియా[1][2]
విద్యాసంస్థలుజర్మన్ చార్లెస్ ఫెర్డినాండ్ విశ్వవిద్యాలయం
వృత్తినవలా రచయిత, కథా రచయిత, భీమా అధికారి
పేరుతెచ్చినవి
  • "Die Verwandlung" ("రూపవిక్రియ")
  • Der Process (విచారణ)
  • "Das Urteil" ("తీర్పు")
  • Das Schloss (కోట)
  • Betrachtung (మననము)
  • Ein Hungerkünstler (ఆకలితోనున్న కళాకారుడు)
  • Briefe an Felice (ఫెలిస్ కి ఉత్తరాలు)
Styleఆధునికవాదం
తల్లిదండ్రులుహెర్మన్ కాఫ్కా
జూలీ కాఫ్కా (లూవీ)
సంతకం
Franz Kafka's signature.svg

ఫ్రాంజ్ కాఫ్కా (3 జూలై 1883 – 3 జూన్ 1924) ఇరవయ్యవ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమయిన జర్మనీ రచయిత. ఆయన పలు నవలలు, కథలు రాశారు. సాహిత్యం లోని అస్థిత్వవాద శైలి పై ఆయన రచనలు ప్రభావవంతమైనవి. తన జీవితాన్ని సంపూర్ణంగా సాహిత్యానికే వెచ్చించాడు కాఫ్కా. అతనికి సాహిత్య వ్యాసంగం పట్ల విపరీతమయిన వ్యామోహం ఉండేది. అతని సాహిత్యం ఇరవయ్యో శతాబ్దపు సందిగ్ధ మానవుని మనఃచైతన్యానికి ప్రాతినిధ్యం వహించగలిగింది. “డాంటే, షేక్‌స్పియర్‌, గెథెలకూ వారి వారి కాలాలకూ ఎలాంటి సంబంధం ఉందో, కాఫ్కాకూ మన కాలానికీ అలాంటి సంబంధమే ఉంది” అన్నాడు కవి డబ్ల్యూహెచ్ ఆడెన్. ఈ క్రింది మాటలు అతని సాహిత్య తృష్ణకు నిదర్శనంగా నిలుస్తాయి.

“నేను సాహిత్యం తప్ప మరేమీ కాను.”

“సాహిత్యం ద్వారానే జీవితాన్ని పట్టుకుని వేలాడుతున్నాను. దాన్ని కోల్పోతే అంతా కోల్పోయినట్టే.”

“రచన చావు కన్నా గాఢమైన నిద్రలాంటిది. శవాల్ని వాటి సమాధుల్లోంచి లాగనట్టే, రాత్రుళ్లు నన్నూ నా డెస్కు నుంచి లాగలేరు.”

“నేను సాహిత్యానికి కనపడని గొలుసుల ద్వారా కట్టివేయబడ్డాను, ఎవరన్నా దగ్గరకొస్తే నా గొలుసులు ముట్టుకుంటున్నారేమో అని అరుస్తాను.”

“నాకు తగ్గ జీవన శైలి ఏమిటంటే, నేను ఒక విశాలమైన సెల్లార్‌లో ఒక మారుమూల గదిలో దీపం ముందు నా రాతసామాగ్రి పెట్టుకుని కూర్చుంటాను. భోజనం తెచ్చేవాళ్లు కూడా నా దగ్గరకు రారు, నా గదికి చాలా దూరంగా సెల్లార్ అవతల ఎక్కడో ఉన్న గుమ్మం దగ్గర పెడతారు. ఈ సెల్లార్ గదుల గూండా ఆ భోజనం దాకా నడచి వెళ్లటమే నా ఏకైక వ్యాయామం. తర్వాత మళ్ళీ రాతబల్ల దగ్గరకు వెళిపోతాను, తాపీగా తింటాను, మళ్లా రాయటం మొదలుపెడతాను. ఎలా రాస్తాననుకున్నావ్! ఎంతెంతటి లోతుల్లోంచి తవ్వి తీస్తాననుకున్నావ్! అదీ శ్రమ లేకుండా! ఎందుకంటే తీక్షణమైన ఏకాగ్రత శ్రమ తెలియనీయదు.”

రచనల గురించీ, పుస్తకాల గురించీ అతనికి నిర్దుష్టమయిన అభిప్రాయాలు ఉండేవి. కౌమారంలోనే గెథె, క్లీస్ట్, నీషే, స్పినోజా, డార్విన్ లను చదువుకున్నాడు. ముఖ్యంగా నీషే ప్రభావం ఎక్కువగా ఉండేది. కాల్పనిక సాహిత్యం కన్నా, రచయితల ఆత్మకథల పైనా, ఉత్తరాలపైనా ఎక్కువ ఆసక్తి చూపించేవాడు. ఒక మిత్రునికి ఇరవయ్యేళ్లప్పుడు రాసిన ఉత్తరంలో ఇలా అంటాడు: “మనల్ని గాయపరిచి, తూట్లు పొడిచే పుస్తకాలే మనం చదవాలి. మన తల మీద మొట్టి నిద్ర లేపకపోతే ఎందుకిక పుస్తకాలు చదవటం? ఆనందం కోసమా! అసలు పుస్తకాలు లేకపోయినా మనం ఆనందంగానే ఉండగలం, ఆనందపెట్టే పుస్తకాలు మనమే చిటికెలో రాయగలం. నిజమైన పుస్తకాలు వేరు. అవి ఒక విపత్తులా, మనకన్నా ఎక్కువగా మనం ప్రేమించిన వారి చావులా, అందరికీ దూరంగా అడవుల్లోకి వెలి వేయబడటంలా, ఒక ఆత్మహత్యలా మనల్ని కదిలించాలి. మనలో గడ్డకట్టుకుపోయిన సముద్రాలకి పుస్తకం ఒక గొడ్డలిపెట్టు కావాలి.” కాఫ్కా పై పుస్తకాలు నిజంగా అలాంటి ప్రభావాన్నే చూపించేవి.

Other Languages
English: Franz Kafka
Аҧсшәа: Франц Кафка
Afrikaans: Franz Kafka
Alemannisch: Franz Kafka
aragonés: Franz Kafka
العربية: فرانس كافكا
asturianu: Franz Kafka
Aymar aru: Franz Kafka
azərbaycanca: Frans Kafka
башҡортса: Франц Кафка
Boarisch: Franz Kafka
žemaitėška: Franz Kafka
беларуская: Франц Кафка
беларуская (тарашкевіца)‎: Франц Кафка
български: Франц Кафка
Bislama: Franz Kafka
brezhoneg: Franz Kafka
bosanski: Franz Kafka
буряад: Франц Кафка
català: Franz Kafka
нохчийн: Кафка, Франц
čeština: Franz Kafka
Cymraeg: Franz Kafka
Deutsch: Franz Kafka
Zazaki: Franz Kafka
Ελληνικά: Φραντς Κάφκα
Esperanto: Franz Kafka
español: Franz Kafka
euskara: Franz Kafka
estremeñu: Franz Kafka
føroyskt: Franz Kafka
français: Franz Kafka
Gaeilge: Franz Kafka
贛語: 卡夫卡
Gàidhlig: Franz Kafka
galego: Franz Kafka
Avañe'ẽ: Franz Kafka
Bahasa Hulontalo: Franz Kafka
עברית: פרנץ קפקא
Fiji Hindi: Franz Kafka
hrvatski: Franz Kafka
Kreyòl ayisyen: Franz Kafka
magyar: Franz Kafka
հայերեն: Ֆրանց Կաֆկա
interlingua: Franz Kafka
Bahasa Indonesia: Franz Kafka
Interlingue: Franz Kafka
Ilokano: Franz Kafka
íslenska: Franz Kafka
italiano: Franz Kafka
Patois: Franz Kafka
Basa Jawa: Franz Kafka
ქართული: ფრანც კაფკა
Qaraqalpaqsha: Franz Kafka
Адыгэбзэ: Франц Кафка
Kabɩyɛ: Franz Kafka
қазақша: Франц Кафка
kurdî: Franz Kafka
Кыргызча: Франц Кафка
Lëtzebuergesch: Franz Kafka
Lingua Franca Nova: Franz Kafka
Limburgs: Franz Kafka
lumbaart: Franz Kafka
لۊری شومالی: فرانتس کافکا
lietuvių: Franz Kafka
latviešu: Francs Kafka
Malagasy: Franz Kafka
олык марий: Франц Кафка
Baso Minangkabau: Franz Kafka
македонски: Франц Кафка
монгол: Франц Кафка
кырык мары: Кафка, Франц
Bahasa Melayu: Franz Kafka
Mirandés: Franz Kafka
မြန်မာဘာသာ: ဖရန့်ဇ်ကပ်ဖ်ကာ
مازِرونی: فرانتس کافکا
Plattdüütsch: Franz Kafka
Nederlands: Franz Kafka
norsk nynorsk: Franz Kafka
occitan: Franz Kafka
Livvinkarjala: Franz Kafka
Picard: Franz Kafka
polski: Franz Kafka
Piemontèis: Franz Kafka
پنجابی: فرانز کافکا
português: Franz Kafka
Runa Simi: Franz Kafka
română: Franz Kafka
armãneashti: Franz Kafka
русский: Кафка, Франц
русиньскый: Франц Кафка
саха тыла: Франц Кафка
sicilianu: Franz Kafka
srpskohrvatski / српскохрватски: Franz Kafka
Simple English: Franz Kafka
slovenčina: Franz Kafka
slovenščina: Franz Kafka
српски / srpski: Франц Кафка
Seeltersk: Franz Kafka
svenska: Franz Kafka
Kiswahili: Franz Kafka
Tagalog: Franz Kafka
Türkçe: Franz Kafka
татарча/tatarça: Франц Кафка
українська: Франц Кафка
oʻzbekcha/ўзбекча: Franz Kafka
vèneto: Franz Kafka
vepsän kel’: Kafka Franc
Tiếng Việt: Franz Kafka
Volapük: Franz Kafka
Winaray: Franz Kafka
მარგალური: ფრანც კაფკა
ייִדיש: פראנץ קאפקא
Yorùbá: Franz Kafka
Bân-lâm-gú: Franz Kafka
粵語: 卡夫卡