ఫతేపూర్ సిక్రీ

బులంద్ దర్వాజా.

ఫతేపూర్ సిక్రీ (Fatehpur Sikri) ( ఉర్దూ فتحپور سیکری, ( హిందీ फतेहपूर सिकरी ), ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఆగ్రా జిల్లా లోని ఒక నగరం, నగరపాలితము కూడా. ఈ నగరాన్ని మొగల్ చక్రవర్తి అక్బర్ 1569లో స్థాపించాడు. అక్బర్ కాలంలో 1571 నుండి 1585 వరకు మొఘలుల రాజధాని. చిత్తోర్ రాన్తంభోర్ మీద విజయం సాధించిన తరువాత అకబర్ తన రాజధానిని ఆగ్రా నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిక్రీ రిట్జ్ ప్రదేశానికి తరలించాలని అనుకున్నాడు. సుఫీ సన్యాసి సలీం చిష్టి గౌరవార్ధం సిక్రీ రిట్జ్ వద్ద నగరాన్ని నిర్మించాలని అనుకున్నాడు.అక్బర్ చక్రవర్తి ఈ ప్రదేశంలో కోటగోడలు కలిగిన నగర నిర్మాణం చేయాలని సంకల్పించాడు. రాజభవనాలు, అంతఃపురాలు, సభాప్రాంగణాలు, మసీదు, ప్రైవేట్ క్వార్టర్లు మరియు ఇతర ఉపయోగాలకు అవసరమైన భవనాలతో కూడిన కోట నిర్మాణ కార్యక్రమాలు 15 సంవత్సరాల కాలం కొనసాగింది. అకబర్ చక్రవర్తి ఆ నగరానికి ఫతేహబాదు అని నామకరణం చేసాడు. అరాబిక్ పూర్వీకమైన పర్షియన్ భాషలో ఫతేహ్ అంటే విజయం అని అర్ధం. తరువాత అది ఫతేపూర్ సిక్రీగా పిలువబడింది. మొగలుల సంరక్షించబడుతున్న ప్రముఖ నిర్మాణాలలో ఫతేపూర్ సిక్రీ ఒకటి.

సమకాలీన చరిత్రకారులు ఫతేపూర్ సిక్రీ నిర్మించడానికి అక్బర్ చాలా ఆసక్తి చూపాడని నిర్మాణం రూపకల్పన మరియు నిర్మాణశైలికి కూడా అక్బరు సూచనలు ఇచ్చాడని భావించారు. వారి పూర్వీకుడైన తైమూరును కీర్తిని స్పురింపజేసేలా పర్షియన్ శైలిలో అద్భుతమైన సభామంటపాల నిర్మాణానికి రూపకల్పన చేయబడింది. ఈ కోటను నిర్మించడానికి ఎంపికచేయబడిన భూభాగం సంపూర్ణ భారతీయత సంతరించుకున్నది. ఫతేపూర్ సిక్రీ పరిసరప్రాంతాలలో లభిస్తున్న ఇసుకరాయి ఈ భవన నిర్మాణానికి తోడ్పడడంతో భవనసముదాయం మొత్తం ఎర్రరాళ్ళతో నిర్మించబడింది. రాజభవన సముదాయంలో పలు ప్రవేశద్వారాలు ఉన్నాయి. ఈ ప్రవేశద్వారాలన్నీ రేఖాగణిత ఆకారంలో రూపకల్పన చేయబడ్డాయి. ఈ డిజైన్ నమూనా అరబ్ మరియు మద్య అసియా గుడారాల నిర్మాణాల నుండి గ్రహించబడ్డాయి. ఫతేపూర్ సిక్రీలో ఉన్న స్మారక నిర్మాణాలు పూర్తిగా రెండు విభిన్న భూభాగాల భవననిర్మాణశైలులను సమగ్రపరచేలా రూపకల్పన చేసిన అక్బర్ చక్రవర్తి మేధోశక్తికి ప్రత్యక్ష నిదర్శనం.

చరిత్ర

ఫతేపూర్ సిక్రీ ప్లాన్

ఈ సుందర రాజభవనం సముదాయం అది నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకున్న కొద్ది కాలానికే 1885లో విసర్జించబడింది. ఈ రాజభవన సముదాయానికి నైరుతిదిశలో సమీపంలో రాజపుత్రులు ఉన్నందున మరియు నీటి ఎద్దడి కారణంగా ఈ రాజభవన సముదాయం విసర్జించబడింది. రాజపుత్రుల సామీప్యం కారణంగా అప్పుడప్పుడూ ఘర్షణలు ఎదుర్కొనవలసిన అవసరం ఏర్పడడం కూడా ఈ భనాన్ని విడిచిపెట్టడానికి ఒక కారణం. తరువాత లాహోరుకు మార్చబడిన రాజధాని సామ్రాజ్యంలో నెలకొన్న అస్థిరత కారణంగా 1598 నాటికి తిరిగి ఆగ్రాకు చేరింది. ఆగ్రాచేరిన తరువాత అక్బర్ చక్రవర్తి దృష్టి దక్షిణ భూభాగం వైపు మళ్ళింది. అయినప్పటికీ 1601లో స్వల్పకాలం నివసించడం మినహా అక్బర్ చక్రవర్తి ఫతేపూర్ సిక్రీకి తిరిగి పోలేదు. తరువాత ఈ రాజభవన సముదాయాన్ని ఆక్రమించుకున్న మొగల్ చక్రవర్తి మహమ్మద్ షా ఈ రాజభవనం సముదాయం మీద కొంత కాలం (1719-1748) ఆధిపత్యం వహించాడు. ఆయన అధికారులలో ఒకరైన సయ్యద్ హుసైని అలీ ఖాన్ భాషా (సయద్ సోదరులలో ఒకరు) 1720లో ఇక్కడ హత్యకు గురి అయ్యాడు. ప్రస్తుతం రెండు కిలోమీటర్లు పొడవు ఒక కిలోమీటర్ వెడల్పైన ఈ రాజభవనం సముదాయంలో సగభాగానికి పైగా నిర్జనంగా మిగిలిపోయింది. ఇప్పటికీ ఈ సుందర రాజభవనం సముదాయం వెంట మూడు వైపులా సుమారు అయిదు మైళ్ళ పొడవున గోడలు నిర్మించబడి ఉన్నాయి. ఇక్కడ రాజభవన సమూహాలే కాక మరికొన్ని భవనాలు కూడా ఉన్నాయి. పాతనగరంలో నౌబత్ ఖానా వద్ద ఉన్న వీధులు శిథిలాలు మినహా మిగిలిన భవనాలన్నీ పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయాయి. వీటిలో ఆగ్రారోడ్ ప్రవేశం సమీపంలోని " డ్రం హౌస్ " ఒకటి. రాజభవనసమూహాల పడమటి కొసలో అధునిక నగరం ఉంది. 1865 నుండి 1904 వరకు అది పురపాలక వ్యవస్థ నిర్వహణలో ఉంటూ వచ్చింది. తరువాత గుర్తింపు పొందిన ప్రాంతంగా మారింది. 1901 నాటికి నగర జనసంఖ్య 7,117. దీర్ఘకాలం నుండి ఈ ప్రదేశం శిల్పకారులకు, మేస్త్రీ పనివారికి నివాస స్థలంగా ఉంటూ వస్తుంది. అక్బర్ చక్రవర్తి సమయంలో ఈ ప్రదేశం ఉన్ని దుస్తులకు మరియు పట్టు వస్త్రాల తయారీకి ప్రసిద్ధిచెంది ఉంది. సిక్రీ గ్రామం ఇంకా సమీపంలో ఉంది.

Other Languages
العربية: فتحبور سيكري
বিষ্ণুপ্রিয়া মণিপুরী: ফতেহপুর সিক্রি
čeština: Fatehpur Sikrí
Esperanto: Fatehpur Sikri
español: Fatehpur Sikri
français: Fatehpur-Sikri
hrvatski: Fatehpur Sikri
Bahasa Indonesia: Fatehpur Sikri
italiano: Fatehpur Sikri
Basa Jawa: Fatehpur Sikri
lietuvių: Fatehpur Sikris
Baso Minangkabau: Fatehpur Sikri
Bahasa Melayu: Fatehpur Sikri
नेपाल भाषा: फतेहपुर सिक्री
Nederlands: Fatehpur Sikri
norsk nynorsk: Fatehpur Sikri
Kapampangan: Fatehpur Sikri
português: Fatehpur Sikri
srpskohrvatski / српскохрватски: Fatehpur Sikri
slovenčina: Fatéhpur Síkrí
српски / srpski: Фатехпур Сикри
Türkçe: Fetihpur Sikri
українська: Фатехпур-Сікрі
Tiếng Việt: Fatehpur Sikri
Bân-lâm-gú: Fatehpur Sikri