ప్రీమియర్ లీగ్

ప్రీమియర్ లీగ్ అనేది అసోసియేషన్ ఫుట్‌బాల్ క్లబ్‌లకు సంబంధించిన ఒక ఇంగ్లీష్ ప్రొఫెషనల్ లీగ్. ఇంగ్లీష్ ఫుట్‌బాల్ లీగ్ వ్యవస్థ అగ్రభాగంలో ఉన్న ఈ లీగ్ దేశంలో ప్రధాన ఫుట్‌బాల్ టోర్నమెంట్‌గా పరిగణించబడుతుంది. దీనిలో 20 క్లబ్‌లు పోటీపడతాయి, ఇది ఫుట్‌బాల్ లీగ్‌తో కలిసి ప్రమోషన్ అండ్ రెలిగేషన్ (స్థానోన్నతి మరియు స్థాన తగ్గింపు) వ్యవస్థలో నిర్వహించబడుతుంది. ప్రీమియర్ లీగ్ అనేది ఒక సంస్థ, దీనిలో 20 సభ్య క్లబ్‌లు వాటాదారులుగా పనిచేస్తాయి. ఆగస్టు నుంచి మే వరకు ప్రీమియర్ లీగ్ సీజన్లు జరుగుతాయి, ప్రతి జట్టు 38 మ్యాచ్‌లు ఆడుతుంది, సీజన్‌లో మొత్తం 380 మ్యాచ్‌లు జరుగుతాయి. ఎక్కువ మ్యాచ్‌లను శనివారాలు మరియు ఆదివారాల్లో నిర్వహిస్తారు, కొన్ని మ్యాచ్‌లు మాత్రం మిగిలినవారాల్లో సాయంత్రం పూట జరుగుతాయి. బార్క్లేస్ బ్యాంక్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తుండటంతో, దీనిని అధికారికంగా బార్క్లేస్ ప్రీమియర్ లీగ్‌ గా వ్యవహరిస్తున్నారు.

1888లో ప్రారంభమైన ఫుట్‌బాల్ లీగ్ నుంచి ఫుట్‌బాల్ లీగ్ ఫస్ట్ డివిజన్‌లోని క్లబ్‌లు బయటకు రావాలని నిర్ణయించుకోవడంతో, ఈ టోర్నీ 1992 ఫిబ్రవరి 20న FA ప్రీమియర్ లీగ్‌గా ప్రారంభమైంది, లాభదాయక టెలివిజన్ హక్కుల ఒప్పందాలు దీని ఏర్పాటుకు అనుకూలంగా మారాయి. ఆ తరువాత నుంచి ప్రీమియర్ లీగ్ ప్రపంచంలో ఎక్కువ మంది వీక్షించే క్రీడాంశంగా అవతరించింది.[1] అంతేకాకుండా ఇది ప్రపంచంలో అత్యంత లాభదాయక ఫుట్‌బాల్ లీగ్‌గా పేరుగాంచింది, 2007-08లో క్లబ్‌ల యొక్క మొత్తం ఆదాయాలు £1.93 బిలియన్లకు ($3.15 బిలియన్లు) చేరుకున్నాయి.[2] గత ఐదేళ్ల కాలంలో ఐరోపా టోర్నమెంట్‌లకు సంబంధించిన ప్రదర్శన ఆధారిత UEFA కోయెఫిషియంట్స్‌లో ఇది మొదటి స్థానంలో ఉంది, స్పెయిన్ యొక్క లా లిగా మరియు ఇటలీ సిరీ A కంటే ఈ లీగ్ ముందు ఉంది.[3]

1010 ఏప్రిల్ 12న, బ్రిటన్ రాణి ఎలిజబెత్ II చేతులమీదగా అంతర్జాతీయ వాణిజ్య విభాగంలో క్వీన్స్ అవార్డ్ ఫర్ ఎంటర్‌ప్రైజ్‌ను ప్రీమియర్ లీగ్ అందుకుంది.[4] అంతర్జాతీయ వాణిజ్యానికి అందించిన విశిష్ట సేవలుకు, ఇంగ్లీష్ ఫుట్‌బాల్ మరియు యునైటెడ్ కింగ్‌డమ్ యొక్క ప్రసారాల పరిశ్రమకు తీసుకొచ్చిన విలువకు గుర్తుగా ప్రీమియర్ లీగ్‌కు ఈ పురస్కారాన్ని అందించారు.2007 నుంచి 2009 వరకు మూడు వరుస 12 నెలల కాలాల్లో విశిష్ట స్థాయిల్లో విదేశీ ఆదాయాల వృద్ధి మరియు వాణిజ్య విజయానికి గుర్తుగా దీనికి అంతర్జాతీయ వాణిజ్య పురస్కారం లభించింది.

ఇప్పటివరకు మొత్తం 44 జట్లు ప్రీమియర్ లీగ్‍లో పాల్గొనగా, వీటిలో కేవలం నాలుగు జట్లు మాత్రమే టైటిల్‌ను గెలుచుకున్నాయి: అవి అర్సెనల్, బ్లాక్‌బర్న్ రోవర్స్, చెల్సియా మరియు మాంచెస్టర్ యునైటెడ్. చెల్సియా ప్రస్తుత ఛాంపియన్‌గా ఉంది, ఈ జట్టు 2009–10 సీజన్ టైటిల్‌ను గెలుచుకుంది.

విషయ సూచిక

Other Languages
Afrikaans: Premier League
Ænglisc: Premier League
asturianu: Premier League
беларуская (тарашкевіца)‎: Прэм’ер-Ліга
čeština: Premier League
Ελληνικά: Πρέμιερ Λιγκ
Esperanto: F.A. Supra Ligo
español: Premier League
føroyskt: Premier League
hrvatski: FA Premier liga
Bahasa Indonesia: Liga Utama Inggris
italiano: Premier League
Lëtzebuergesch: Premier League
Limburgs: Premier League
lietuvių: Premier League
Baso Minangkabau: Liga Utamo Inggirih
Bahasa Melayu: Liga Perdana Inggeris
မြန်မာဘာသာ: ပရီးမီးယားလိဂ်
Nederlands: Premier League
norsk nynorsk: Premier League
português: Premier League
română: Premier League
srpskohrvatski / српскохрватски: Premijer liga
Simple English: English Premier League
slovenčina: FA Premier League
slovenščina: Premier League
Soomaaliga: Premier Leagueka
српски / srpski: Премијер лига
Türkçe: Premier League