ప్రబోధానంద యోగీశ్వరులు

ప్రబోధానంద యోగీశ్వరులు
Probodhananda Yogiswarulu (cropped).jpg
ప్రబోధానంద
జననంగుత్తా పెద్దన్న చౌదరి
1950 ఏప్రిల్ 5
వృత్తిఆధ్యాత్మికవేత్త, రచయిత
ప్రసిద్ధులుఇందు జ్ఞాన వేదిక వ్యవస్థాపకుడు, త్రైత సిద్ధాంత కర్త.
మతంఇందు
వెబ్ సైటుwww.thraithashakam.org

ప్రబోధానంద యోగీశ్వరులు వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, త్రైత సిద్ధాంత కర్త, బహు గ్రంథకర్త. ఇతని అసలు పేరు గుత్తా పెద్దన్న చౌదరి.[1] అనంతపురం జిల్లా, తాడిపత్రి మండలం, చిన్నపొడమల గ్రామంలో ప్రబోధాశ్రమము, శ్రీకృష్ణమందిరము, ఇందూ జ్ఞాన వేదికను స్థాపించి తద్వారా తన రచనల్ని, ప్రసంగాలను ప్రచారం చేస్తున్నాడు. మనుషులందరికీ దేవుడు ఒక్కడేనని, భగవద్గీత, బైబిల్, ఖురాన్లలో వున్న దైవజ్ఞానము ఒక్కటేనని త్రైత సిద్ధాంతం అన్నది చెప్తోంది. ప్రబోధానంద ఈ సిద్ధాంతకర్త. పలు అంశాలకు ఈ సిద్ధాంతాన్ని వర్తింపజేస్తూ, తన ఆధ్యాత్మిక భావనలను వివరిస్తూ ప్రబోధానంద అనేక పుస్తకాలు రాశాడు. పెద్దన్న చౌదరి అన్న పూర్వనామం వదిలి ప్రబోధానందగా మారి త్రైత సిద్ధాంతాన్ని చెప్పడం 1978లో ప్రారంభమైంది. ప్రబోధానంద శిష్యులు 1978తో క్రీస్తుశకం ముగిసి త్రైత శకం ప్రారంభమైందని ప్రతీ సంవత్సరాన్ని ఈ త్రైత శకం లెక్కల్లో చెప్పుకుంటూంటారు.

ఇతని వివాదస్పద అభిప్రాయాలు, బోధనల కారణంగా ఆశ్రమానికి దగ్గరలో ఉన్న ప్రజలతో వివాదాలు తలెత్తాయి. పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర రెడ్డితో ఉన్న రాజకీయ విభేదాల కారణంగాను,[1] ఆశ్రమ వాసులు, స్థానికుల మధ్య జరిగిన ఘర్షణల కారణం గానూ 2018 సెప్టెంబరులో ఆశ్రమ ప్రాంతం ఉద్రిక్తతలకు లోనైంది.

Other Languages