ప్రకటన

భారత దేశములో స్వాతంత్ర్య పూర్వమే స్థాపించబడిన పోల్సన్ బ్రాండు యొక్క వాణిజ్య ప్రకటన. పిల్లలు పోల్సన్ వెన్నని ఇష్టపడతారని, వారి ఆరోగ్యాన్ని కాపాడటానికి సర్వత్రా లభించే అత్యుత్తమమైన పోల్సన్ వెన్ననే వాడమనే సందేశం ఆంగ్లంలో చూడవచ్చును. ఒక చిన్ని పాప బ్రెడ్డు ముక్క పై సంతోషంగా వెన్నని రాయటం, నేపథ్యంలో ఒక హోటల్ కి వచ్చిన జంటకి వెయిటర్ (బహుశా) పోల్సన్ కాఫీనే తీసుకురావటం ఈ ప్రకటనలో చూడవచ్చును. 70వ దశకం వరకూ పోల్సన్ బ్రాండుని వాడేవారు సంపన్న వర్గాలుగా గుర్తింపబడేవారు.

ప్రకటన (ఆంగ్లం: Advertising) అనేది సాధారణంగా ఒక వ్యాపారాత్మక/రాజకీయ/సైద్ధాంతిక సమర్పణకి సంబంధించి వీక్షకులని ఒక చర్యని చేపట్టటానికి లేదా అప్పటికే చేపట్టిన చర్యనే కొనసాగించటానికి ఒప్పించే విపణీకరణలో భాగమైన ఒక రకమైన భావప్రకటన.

ప్రకటన అనగా ఒక సంస్థ లేదా ప్రభుత్వము, అధికారికంగా ప్రజలవద్దకు చేర్చే సమాచారం. ఏ సంస్థ అయినా ప్రజలకు తెలియజేయవలసిన విషయాన్ని కొన్ని మాధ్యమాల ద్వారా ప్రజలవద్దకు తీసుకుపోయే ప్రక్రియ ప్రకటనా ప్రక్రియ. ప్రకటన ముఖ్య ఉద్దేశం, విషయ పరిజ్ఞానాన్ని ప్రజలకు తెలియజెప్పడం. పూర్వపుకాలంలో ప్రభుత్వపరమైన, లేదా అధికారిక పరమైన విషయాలను, ప్రజలకు తెలియజేసేందుకు "దండోరా" వేయించేవారు. ఇదొక ప్రకటనా మాధ్యమం.మనం తరచూ వార్తాపత్రికల్లోనూ లేక టీవిలోను ఈ ప్రకటనలను చూస్తూ ఉంటాము.

ల్యాటిన్ లో ad vertere అనగా "ఒక వైపుకి తిరగటం". ప్రకటన వీక్షకులని తమవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఆంగ్లంలో దీనికి Advertisment అనే పేరు వచ్చింది. సంస్థ యొక్క నమ్మకాన్ని పెంపొందించుకొనటానికి, దాని యొక్క విజయాలు ఉద్యోగుల, వాటాదారుల కంటబడటానికి కూడా ప్రకటనలని వాడుకొనవచ్చును. వార్తాపత్రికలు, వారపత్రికలు, టెలివిజన్, రేడియో, బహిరంగ ప్రదేశాలు, ఈ-మైయిల్ వంటి సాంప్రదాయిక ప్రసార మాధ్యమాలతో బాటు, బ్లాగులు, వెబ్ సైట్లు మరియు సోషల్ నెట్వర్కింగ్ వంటి ఆధునిక ప్రసార మాధ్యమాలలో కూడా ప్రకటనల సందేశాలని మనం నిత్యం చూస్తూ ఉంటాము.

బ్రాండింగ్ (ఒక ఉత్పత్తి యొక్క పేరు లేదా చిత్రానికి వినియోగదారులలో కావలసిన లక్షణాలని ఆపాదించటం) ద్వారా వాణిజ్య ప్రకటనలు తమ ఉత్పత్తుల లేదా సేవల వినియోగాన్ని పెంపొందించేందుకు ప్రయత్నిస్తాయి. రాజకీయ పార్టీలు, ప్రత్యేక ఆసక్తి సమూహాలు, మత సంబంధ సంస్థలు మరియు ప్రభుత్వ మంత్రాంగాలు వాణిజ్యేతర ప్రకటనదారులుగా పరిగణించవచ్చును. వాణిజ్యేతర ప్రకటనదారులు చాటింపులు, లాభాపేక్ష లేని సేవలని అందించటం ద్వారా ప్రకటనలు చేస్తూ ఉంటారు.

భారతదేశం లోని కొన్ని ప్రముఖ ప్రకటన సంస్థ (Advertising agency) లు

  • ఒగిల్వీ అండ్ మాథర్ (Ogilvy & Mather)
  • డిడిబి ముద్ర గ్రూప్ (DDB_Mudra)
  • లోవ్ లింటాస్ (Lowe Lintas)
  • లియో బర్నెట్ (Leo Burnett)
  • జే వాల్టర్ థాంప్సన్ (JWT)
  • హవాస్ వర్ల్డ్ వైడ్ (Havas Worldwide)
  • ఆర్ కే స్వామి బి బి డి ఓ (RK Swamy BBDO)
  • రీడిఫ్యూజన్ డి వై ఆర్ (Rediffusion DYR)
Other Languages
हिन्दी: विज्ञापन
ಕನ್ನಡ: ಜಾಹೀರಾತು
മലയാളം: പരസ്യം
aragonés: Publicidat
العربية: إعلان
অসমীয়া: বিজ্ঞাপন
azərbaycanca: Reklam
башҡортса: Тәҡдимнамә
Boarisch: Weabung
беларуская: Рэклама
беларуская (тарашкевіца)‎: Рэкляма
български: Реклама
বাংলা: বিজ্ঞাপন
brezhoneg: Bruderezh
català: Publicitat
Chavacano de Zamboanga: Publicidad
Cebuano: Pagpublisydad
کوردی: بانگەشە
čeština: Reklama
Чӑвашла: Янрав
Cymraeg: Hysbysebu
dansk: Reklame
Deutsch: Werbung
Ελληνικά: Διαφήμιση
Esperanto: Reklamo
español: Publicidad
eesti: Reklaam
euskara: Publizitate
فارسی: تبلیغات
suomi: Mainonta
Võro: Reklaam
français: Publicité
furlan: Publicitât
Frysk: Reklame
Gaeilge: Fógraíocht
galego: Publicidade
ગુજરાતી: જાહેરાત
עברית: פרסומת
hrvatski: Oglašavanje
Kreyòl ayisyen: Reklam
magyar: Reklám
հայերեն: Գովազդ
Bahasa Indonesia: Iklan
Iñupiak: Maniuġun
íslenska: Auglýsing
italiano: Pubblicità
日本語: 広告
Patois: Advataizin
Basa Jawa: Iklan
ქართული: რეკლამა
Kabɩyɛ: Tɔm susuu
қазақша: Жарнама
한국어: 광고
kurdî: Reklam
Кыргызча: Жарнама
lietuvių: Reklama
latviešu: Reklāma
македонски: Реклама
मराठी: जाहिरात
Bahasa Melayu: Iklan
नेपाली: विज्ञापन
नेपाल भाषा: विज्ञापन
Nederlands: Reclame
norsk nynorsk: Reklame
norsk: Reklame
occitan: Publicitat
polski: Reklama
português: Publicidade
română: Publicitate
русский: Реклама
sicilianu: Pubbricitati
srpskohrvatski / српскохрватски: Reklama
Simple English: Advertising
slovenčina: Reklama
slovenščina: Oglaševanje
chiShona: Kushambadza
српски / srpski: Реклама
Seeltersk: Wierwenge
Basa Sunda: Pariwara
svenska: Reklam
тоҷикӣ: Таблиғот
Türkçe: Reklam
татарча/tatarça: Реклама
ئۇيغۇرچە / Uyghurche: ئېلان
українська: Реклама
Tiếng Việt: Quảng cáo
walon: Reclame
吴语: 广告
ייִדיש: רעקלאמע
中文: 廣告
Bân-lâm-gú: Kóng-kò
粵語: 廣告