పారాసిటమాల్

పారాసిటమాల్
వ్యవస్థాత్మక ( IUPAC) పేరు
N-(4-hydroxyphenyl)ethanamide
Clinical data
లైసెన్స్ సమాచారము link
ప్రెగ్నన్సీ వర్గం A ( AU) B ( US) safe
చట్టపరమైన స్థితి Unscheduled ( AU) GSL ( UK) OTC ( US)
Routes Oral, rectal, intravenous
Pharmacokinetic data
Bioavailability almost 100%
మెటాబాలిజం 90 to 95% Hepatic
అర్థ జీవిత కాలం 1–4 h
Excretion Renal
Identifiers
CAS number 103-90-2
ATC code BE01
PubChem CID 1983
DrugBank APRD00252
ChemSpider 1906
Chemical data
Formula C8 H9 N O2 
Mol. mass 151.17 g/mol
Physical data
Density 1.263 g/cm3 g/cm³
Melt. point 168 °C (334 °F)
Solubility in water 14 mg/mL (25 °C) mg/mL (20 °C)
 YesY  (verify)

పారాసెటమాల్ ( INN) ([1]) లేదా ఎసిటమైనోఫేన్ ([2]) ( USAN) విస్త్రుతంగా వాడబడుతున్న ఒక ఓవర్-ది-కౌంటర్ అనల్జసిక్ (నొప్పి నివారిణి) మరియు యాంటీ పైరటిక్ (జ్వరము తగ్గించేది). దీన్ని సాధారణముగా జ్వరము, తలనొప్పి మరియు ఇతర చిన్న నొప్పులకు, పోటులకి వాడుతారు. ఇది అనేక జలుబు మరియు ఫ్లూ మందులు తయారీలో చేర్చబడుతున్న ఒక ముఖ్య పదార్ధము. శస్త్ర చికిత్స అనంతరం ఏర్పడే నొప్పి వంటి తీవ్రమైన నొప్పులని నివారించడానికి కూడా పారాసెటమాల్ ని స్టీరాయ్ద్ కాని వాపు తగ్గించే మందులతో (NSAIDలు) మరియు ఒపియాయ్ద్ అనాల్జేసిక్ లతో కలిపి వాడుతారు. [1]

పారాసిటమాల్

సిఫార్సు చేయబడిన మోతాదులో (1000 mg ఒక మోతాదుకి చొప్పున పెద్దవాళ్ళకి రోజుకి 4000 mg వరకు, మద్యం తాగే వాళ్ళకయితే రోజుకి 2000 mg వరకు [2]) వాడినప్పుడు మానవులకి సురక్షితమే. కాని పారాసెటమాల్ ని స్వల్పవ్యవధిలో మితిమీరిన మోతాదులో వాడినప్పుడు కాలేయానికి ప్రాణాంతకమైన రీతిలో హాని ఏర్పడే అవకాశము ఉంటుంది. అరుదుగా కొంత మందికి సాధారణ మోతాదుతోనే ఈ హాని కలగొచ్చు; మద్యం సేవించడము వల్ల ఈ ఆపద పెరుగుతుంది. పాశ్చాత్ట్స్, యునైటెడ్ కింగ్డం, ఆస్ట్రేలియా మరియు న్యు జీలాండ్ దేశాలలో ఎక్కువ మోతాదులో వాడబడే మందులలో పారాసెటమాల్ అగ్ర స్థానములో ఉంది. [3] [4] [5] [6]

పారాసెటమాల్ ను బొగ్గు తారు నుండి తయారు చేస్తారు. ఇది " ఎనిలైన్ ఎనాల్జెసిక్స్" అనే వర్గానికి చెందిన మందు; ఇటువంటి మందులలో ఇది మాత్రమే ఈనాటికి కూడా ఉపయోగములో ఉంది. [7] ఒకప్పుడు అనాల్జేసిక్ గానూ యాంటిపైరేటిక్ గానూ ప్రసిద్ధి చెందిన ఫేనసేటిన్లో పారాసెటమాల్ యాక్టివ్ మెటాబోలైట్ గా ఉంది. అయితే ఫేనసేటిన్ మరియు వాటి మిశ్రమాలు లాగ కాకుండా పారాసెటమాల్ చికిత్సకు సరిపడిన మోతాదులో కేన్సరు కలిగించదని భావిస్తున్నారు. [8] అసిటామినోఫెన్ (యునైటెడ్ స్టేట్స్, కేనడా, హాంగ్ కాంగ్ మరియు ఇరాన్ దేశాలలో వాడబడుతున్న పదం [9]) మరియు పారాసెటమాల్ (ఇతర దేశాలలో వాడబడుతున్న పదం) అనే రెండు పదాలు ఈ పదార్ధము యొక్క రసాయన పేర్ల నుండి వచ్చింది; పారా -ఎసిటై ల్ ఎమైనోఫేనాల్ మరియు పారా -ఎసేటై ల్ ఎమైనోఫెన్. కొన్ని సంధర్భాలలో దీన్ని N- సేటైల్- ఆరా- మినోఫే నోల్ లేదా APAP గా సంక్షిప్తం చేయబడుతుంది.

చరిత్ర

ఎసిటానిలైడ్ అనాల్జేసిక్ మరియు యాంటిపైరేటిక్ గుణాలతో కూడిన అనిలిన్ నుండి ఉత్పన్నమైన మొదటి మందు. దీన్ని త్వరగతిలో యాంటిఫెబ్రిన్ అనే పేరుతో 1886 లో ఎ.కాన్ మరియు పి.హెప్ వైద్య వృత్తిలో ప్రవేశపెట్టారు. [10] అయితే దీనికి మిథిమోగ్లోబినేమియా వల్ల ఏర్పడే సైనోసిస్ వంటి అత్యంత భయంగొలిపే, ఆమోదయోగ్యం కాని దుష్ట ప్రభావం ఉన్నందున, దానికంటే తక్కువ విషమ ప్రభావం కలిగిన ఎనిలిన్ నుండి ఉత్పన్నమైన మందులని కనుగొనటానికి అన్వేషణ మొదలైంది. [7] అప్పడికే హార్మన్ నోర్త్రాప్ మోర్స్ పారాసెటమాల్ ని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలో తయారు చేశారు. దీనికి -నైట్రోఫేనాల్ని గ్లేషియల్ ఎసిటిక్ ఆమ్లము లోని టిన్తో కలిపి క్షయకరణం చేసే పద్ధతిని 1877లో వాడారు. [11] [12] అయితే, 1887లోనే తొలిసారిగా పారాసెటమాల్ ని క్లినికల్ ఫార్మకాలజిస్ట్ జోసెఫ్ వాన్ మేరింగ్ రోగులమీద ప్రయోగం చేశారు. [7] పారాసెటమాల్ ను, మరొక ఎనిలిన్ నుండి ఉత్పన్నమైన ఫేనాసిటిన్ ను, వైద్యంగా వాడటం గురించిన ఒక పరిశోధన పత్రాన్ని వాన్ మేరింగ్ 1893లో ప్రచురణ చేశారు. [13] ఫెనాసిటిన్ మాదిరిగా కాకుండా పారాసెటమాల్ కి మిథేమోగ్లోబినేమియాని ఉత్పన్నం చేసే ధోరణి కొంత ఉందని వాన్ మేరింగ్ పేర్కొన్నారు. వెంటనే పారాసెటమాల్ ని వాడటం ఆపి, ఫేనాసిటిన్ ని వాడటం మొదలుపెట్టారు. ఫేనాసిటిన్ అమ్మకంతో బేయర్ ఒక పెద్ద మందుల సంస్థగా పేరు పొందింది. [14] 1899లో హేయిన్రిచ్ డ్రేసేర్ చే ప్రవేశపెట్టబడిన యాస్పిరిన్ప్రభావం వల్ల కొంత మేరకు వెనకబడినా, ఫెనాసిటిన్ చాల దశాబ్దాలు వరకు జనసమ్మతమైన మందుగా ఉండేది. ముఖ్యంగా, విస్త్రుతంగా ప్రచారం చేయబడిన ఫెనాసిటిన్, యాస్పిరిన్లేదా ఒక అమినోపైరిన్ వ్యుత్పన్నం, కేఫీన్ మరియు కొన్ని సార్లు బార్బిట్యురేట్తో కూడిన ఓవర్-ది-కౌంటర్ "తలనొప్పి మిశ్రమాల"లో వాడబడింది. [7]

వాన్ మేరింగ్ పేర్కొన్న విషయాన్ని అర్ధ శతాబ్దం వరకు ఎవరు ఎదురించలేదు. తరువాత యునైటెడ్ స్టేట్స్ కు చెందిన రెండు పరిశోధనా బృందాలు ఎసిటెనలైడ్ మరియు పారాసెటమాల్ యొక్క జీవనప్రక్రియని పరిశీలించారు. [14] మానవ రక్తములో ఉన్న ఎసిటనలైడ్ యొక్క ముఖ్యమైన మెటాబోలైట్ పారాసెటమాల్ అని, 1947లో డేవిడ్ లెస్టర్ మరియు లియాన్ గ్రీన్బెర్గ్ ఆధారాలు చూపారు. తరువాత ఒక పరిశోధనలో అల్బినో ఎలుకలకి పెద్ద మోతాదులో పారాసెటమాల్ ఇచ్చినప్పుడు మిథేమోగ్లోబినేమియా ఏర్పడలేదని పేర్కొన్నారు. [15] సెప్టెంబర్ 1948లో జర్నల్ అఫ్ ఫార్మకాలజీ అండ్ ఏక్ష్పెరిమెన్టల్ థేరపెటిక్స్ లో ప్రచురించబడిన మూడు పరిశోధన పత్రాలలో బెర్నార్డ్ బ్రోడీ, జూలియస్ ఆక్షెల్రాడ్ మరియు ఫ్రెడరిక్ ఫ్లిన్ ముగ్గురూ, నిర్ణీతమైన పద్ధతులు ద్వారా మానవ రక్తములో ఉన్న ఎసిటనలైడ్ యొక్క ముఖ్యమైన మెటాబోలైట్ పారాసెటమాల్ అని మరియు అది దాని పూర్వగామి మాదిరిగానే నొప్పినివారణకు సమర్ధ ఫలితాలు ఇస్తుందని నిర్ధారించారు. [16] [17] [18] ముఖ్యంగా ఫేనైల్ హైడ్రాక్సైల్ ఎమైన్ అనే మరొక మెటాబోలైట్ మానవులలో మిథేమొగ్లోబినేమియాకు ముఖ్య కారణం అని కూడా వారు సూచించారు. 1949లో బ్రాడీ మరియు ఆక్సెల్రాడ్ దీన్ని అనుసరించి విడుదల చేసిన మరొక పరిశోధనా పత్రములో, ఫెనాసిటిన్ కూడా పారాసెటమాల్ గా జీవప్రక్రియ అవుతుందని నిర్ధారించారు. [19] దీనివల్ల పారాసెటమాల్ "మరల కనిపెట్టబడింది". [7] పారాసెటమాల్ ని వాన్ మేరింగ్ 4-అమినోఫేనాల్ నుండి తయారు చేసినప్పుడు అది 4-ఎమినోఫేనాల్తో కల్తీ అయి ఉండవచ్చునని అదే అతని తప్పు ఫలితాలకి కారణమయి ఉండవచ్చునని సూచించారు.

బెర్నార్డ్ బ్రోడీ మరియు జూలియస్ అక్సేల్రోడ్ (చిత్రీకరించారు) ఎసిటెనలైడ్ మరియు ఫినేసేటిన్ రెండూ పారాసెటమోల్ గా జీవప్రక్రియ ద్వారా మార్పు చెందినట్లు ప్రదర్శింపబడి, ఒక నొప్పినివారిణిగా మరింత బాగా ఇముడుతుంది.

పారాసెటమాల్ మొదటి సారిగా యునైటెడ్ స్టేట్స్ లో 1953 సంవత్సరమున స్టెర్లింగ్-విన్త్రోప్ కో. చే విక్రయించబడింది. ఇది అస్పిరిన్ కంటే మేలని, ఇది పిల్లలకు మరియు కడుపులో పుండ్లు ఉన్నవారికి సురక్షితమని ప్రచారం చేశారు. [14] యునైటెడ్ స్టేట్స్ లో ప్రస్తుతం ప్రసిద్ధి చెందిన పారాసెటమాల్ బ్రాండ్ అయిన టైలినాల్ని 1955లో మేక్ నీల్ లేబోరేటరీస్ ప్రవేశ పెట్టారు. వారు పారాసెటమాల్ ని పిల్లలకు నొప్పి మరియు జ్వరము నివారణిగా ప్రచారం చేసి అమ్మడం మొదలు పెట్టారు. వారు దీన్ని టైలినాల్ చిల్రన్స్ ఎలిక్సిర్ అనే పేరుతో అమ్మారు. "టైలినాల్" అనే పదం పారా -ఏస్టైల్ ఎమైనోఫ్ఈనోల్ నుండి వచ్చింది. [20] 1956లో 500 mg పారాసెటమాల్ మాత్రలు యునైటెడ్ కింగ్డంలో పానడాల్ అనే వ్యాపార పేరుతో అమ్మడం మొదలయింది. దీన్ని స్టెర్లింగ్ డ్రగ్ ఇంక్. యొక్క ఉపసంస్థ అయిన ఫ్రెడరిక్ స్టియర్న్స్ & కో ఉత్పత్తి చేశారు. పానడాల్ అప్పట్లో నొప్పి మరియు జ్వరానికి వైద్యుల నిర్దేశం మేరకే అమ్మబడింది. ఇది కడుపుకి కోమలంగా ఉంటుందని ప్రచారం చేశారు ఎందుకంటే అప్పట్లో ఇతర నొప్పినివారిణి మందులలో కడుపులో మంట కలిగించే యాస్పిరిన్ ఉండేది.[ ఆధారం కోరబడింది] 1963లో పారాసెటమాల్ బ్రిటిష్ ఫార్మకోపియాలో చేర్చబడింది. అప్పటినుండి దాదాపు ఏ దుష్ఫలితాలు లేని మరియు ఇతర మందులతో అతి తక్కువ సంఘర్షణ కలిగి ఉన్న ఒక నొప్పినివారిణి అని పారాసెటమాల్ కు ఆదరణ లభించింది. [12] సురక్షత గురించిన చింతల కారణముగా 1970ల వరకు పారాసెటమాల్ విస్తృతంగా ఆమోదం పొందలేదు. అయితే 1980 దశాబ్దములో పారాసిటమాల్ అమ్మకం యాస్పిరిన్ అమ్మకాన్ని దాటి పోయింది, యునైటెడ్ కింగ్దొంలో సహా. దీనితో పాటు, అనాల్జేసిక్ నేఫ్రోపతి మరియు రక్తముపై దుష్ప్రభావాలకు కారణమవుతుందని ఫెనాసిటిన్ పై ఆరోపణలు రావటంతో వ్యాపార రీత్యా అది అంతమయింది. [7]

పారాసెటమాల్ యొక్క U.S. పేటంట్ల కాల పరిమితి ఎన్నడో ముగిసిపోయి, 1984 సంవత్సరపు డ్రగ్ ప్రైస్ కామ్పెటిషన్ అండ్ పేటంట్ టర్మ్ రేస్టోరేషన్ యాక్ట్ కింద సామాన్య (జెనెరిక్) మందులు విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. అయితే కొన్ని టైలేనాల్ మందులు మాత్రం 2007 వరకు పేటెంట్ పరిమితిలోనే ఉన్నాయి. సెప్టెంబర్ 3, 1998న దరఖాస్తు చేయబడిన U.S. పేటంట్ 6,126,967 ని "అసిటామినోఫెన్ కణాల యొక్క పొడిగించబడిన విడుదల" కొరకు ఆమోదించబడింది. [21]

Other Languages
English: Paracetamol
Afrikaans: Parasetamol
العربية: باراسيتامول
تۆرکجه: استامینوفن
български: Парацетамол
বিষ্ণুপ্রিয়া মণিপুরী: প্যারাসিটামল
bosanski: Paracetamol
català: Paracetamol
کوردی: پانادۆڵ
čeština: Paracetamol
Cymraeg: Parasetamol
Deutsch: Paracetamol
ދިވެހިބަސް: ޕެރަސެޓަމޯލް
Ελληνικά: Παρακεταμόλη
Esperanto: Paracetamolo
español: Paracetamol
euskara: Parazetamol
français: Paracétamol
Nordfriisk: Paracetamol
galego: Paracetamol
עברית: פרצטמול
hrvatski: Paracetamol
magyar: Paracetamol
Հայերեն: Պարացետամոլ
Bahasa Indonesia: Parasetamol
íslenska: Parasetamól
italiano: Paracetamolo
қазақша: Парацетамол
lingála: Paracétamol
lietuvių: Paracetamolis
latviešu: Paracetamols
македонски: Парацетамол
Bahasa Melayu: Parasetamol
नेपाल भाषा: पारासिटामोल
Nederlands: Paracetamol
occitan: Paracetamòl
polski: Paracetamol
português: Paracetamol
română: Paracetamol
русский: Парацетамол
srpskohrvatski / српскохрватски: Paracetamol
Simple English: Paracetamol
slovenčina: Paracetamol
slovenščina: Paracetamol
српски / srpski: Paracetamol
Basa Sunda: Parasetamol
svenska: Paracetamol
Türkçe: Parasetamol
українська: Парацетамол
Tiếng Việt: Paracetamol
粵語: 撲熱息痛