టెలీఫోను

రొటేటరీ టెలిఫోన్
టచ్ టోన్® సింగల్ లైన్ వాణిజ్య టెలీఫోను, వార్త నిరీక్షణ ల్యాంపు తో

టెలిఫోను (దూరవాణి) అనేది దూర ప్రాంతాలకు సమాచారాన్ని ధ్వని తరంగాల నుండి విద్యుత్ తరంగాలుగా మార్చి తీగల ద్వారా లేదా యితర మాధ్యమం ద్వారా చేరవేసే పరికరం. టెలీఫోను ( గ్రీకు భాష నుండి 'టెలీ' (τηλέ) = దూర, మరియు 'ఫోను' (φωνή) = వాణి) ఒక 'దూర సమాచార' పరికరం, దీనిని శబ్ద ప్రసారం మరియు శబ్ద గ్రహణ కొరకు ఉపయోగిస్తారు. సాధారణంగా ఇద్దరు సంభాషించుకోవడానికి, కొన్ని సమయాల్లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది సంభాషించుకోవడానికి ఉపయోగిస్తారు. ప్రపంచంలో ఇది సర్వసాధారణ పరికరం. దీనియొక్క మొదటి పేటెంట్ హక్కును 1876 లో అలెగ్జాండర్ గ్రాహంబెల్ అనే శాస్త్రజ్ఞుడు పొందాడు. తర్వాత టెలిఫోన్ లలో యితర మార్పులు యితర శాస్త్రజ్ఞులచే చేయబడ్డాయి. ఇది క్రమేణా ప్రపంచంలో వ్యాపార వర్గాలకు, ప్రభుత్వాలకే పరిమితం కాకుండా సామాన్య మానవునికి కూడా అందుబాటులోకి వచ్చింది.

టెలిఫోన్ (దూరవాణి) లో ముఖ్యమైన భాగములు, మైక్రోఫోన్ (ట్రాన్స్ మీటరు) మాట్లాడుటకు, మరియు రిసీవర్ (వినుటకు) ఉంటాయి. ప్రతి టెలీఫోన్ కు ఒక సంఖ్య ఉంటుంది. దానికి వేరొక ఫోన్ తో చేసినపుడు అవి అనుసంధానించబడి టెలిఫోన్ నుండి శబ్దం వినబడుతుంది. దీని ఆధారంగా ఫోన్ వచ్చే సమాచారం తెలుసుకోవచ్చు. సుమారు 1970 ప్రాంతం వరకు అనేక టెలిఫోన్ లు రోటరీ డయల్ (నంబర్లు త్రిప్పుట) తో పనిచేయసాగాయి. కానీ 1963 లో AT&T అనే సంస్థ పుష్ బటన్ డయల్ తెలీఫోన్లను మొదట ప్రవేశపెట్టింది [1]. రిసీవర్ మరియు ట్రాన్స్ మీటర్ లు ఒకే హాండ్ సెట్ కు అమర్చి ఒకేసారు మాట్లాడుటకు, వినుటకు సౌలభ్యం చేకూర్చారు. ఈ హాండ్ సెట్ కొన్ని తీగలతో టెలిఫోన్ సెట్ కు అనుసంధానించబడుతుంది.

లాండ్ లైన్ టెలీఫోన్ టెలిఫోన్ నెట్ వర్క్ కు తీగల ద్వారా, మొబైల్ ఫోన్, సెల్యులర్ ఫోన్ లు టెలిఫోన్ నెట్ వర్క్ కు రేడియో ప్రసారాల ద్వారా, కార్డ్ లెస్ ఫోన్ లో హాండ్ సెట్ నుండి ఫోన్ కు రేడియో ప్రసారాలద్వారా టెలిఫోన్ ఎక్సేంజికి అనుసంధానబది ఉంటుంది. ప్రసారిణి (Transmitter) టెలిఫోన్ నెట్ వర్క్ నుండి టెలిఫోన్ గ్రాహకం వరకు శబ్ద తరంగాలను విద్యుత్ సంకేతాలుగా మార్చి పంపుతుంది. టెలిఫోన్ లోని గ్రాహకం వచ్చిన విద్యుత్ సంకేతాలను మరల శబ్ద తరంగాలుగా మార్చుతుంది.

రీస్ కనుగొన్న టెలీఫోన్

జోహన్ ఫిలిప్ రీస్
రీస్ తయారుచేసిన దూరవాణి

"వినబడే శబ్దాలను దృశ్య సంకేతాలుగా మార్చడానికి ఎంత దూరంలో అయినా విద్యుత్ ప్రవాహాన్ని శబ్దాలుగా పునరుత్పత్తి చేయడానికీ వీలైన ఓ యంత్రాన్ని నేను కనిపెట్టాను. దీని పేరు టెలిఫోన్" --- అని జర్మనీలో ఫ్రాంక్‍ఫర్డుకు దగ్గరగా ఓ ప్రైవేట్ పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న పేద యువకుడు 1860 లో రాశాడు. అతని పేరు. ఫిలిప్‍రీస్. స్కూల్ ప్రాంగణంలో వుండే చిన్న వర్క్ షాపులో తీరిక దొరికినప్పుడల్లా అతడు పిల్లలకోసం ఏవో ప్రయోగాలను నమూనాలను చేస్తుండేవాడు. మాట్లాడడానికీ, వినడానికీ సంబంధించిన ప్రయోగాల్లో అతనికి అభిరుచి మెండు. విద్యుచ్ఛక్తి ద్వారా శబ్దాలను ప్రసారం చేయాలన్న ధ్యేయంతో అతడెంతో కృషి చేశాడు. శ్రవణేంద్రియమైన చెవి నమూనాను అచ్చం అలాగే కొయ్యతో చేసి, నాడులకు బదులు విద్యుత్ తీగలను వుపయోగించాడు. ఇలాంటి రెండు చెవులను బాటరీ ద్వారా తీగలతో కలిపి ఒక చెవిలో మాట్లాడితే మరో చెవితో ఆ శబ్దాలను మందకొడిగా వినగలిగాడు.

ప్రసారిణిగా, రిసీవర్ గా ఇవి సమర్థవంతంగా పనిచేయాలంటే, వీటి నిర్మాణంలో కొద్దిగా మార్పులు అవసరమని అతడు గుర్తించాడు. పీపాకు ఒకవైపున పెద్ద రంధ్రం తొలిచి దానికి అడ్డంగా జంతు సంబంధమైన పల్చని చర్మం పొరను కట్టి, దీన్ని ప్రసారిణిగా ఉపయోగించాడు. అల్లిక సూది చుట్టూ తీగలు చుట్టి ఫిడేలుకు సంధించి దీన్ని రిసీవర్ గా వాడాడు. ఒకరోజు రిసీవర్ ని తరగతి గదిలో వుంచి, వర్క్ షాపులో ఉన్న ప్రసారిణి ముందు నిలబడి సంగీత వాద్యాలను వాయిస్తూ చర్మం పొర ముందు గానం చేశాడు. తరగతిలో కూర్చున్న పిల్లలకు రిసీవర్ నుంచి కొన్ని అస్పష్ట శబ్దాలు వినబడ్డాయి.

1861 అక్టోబరులో ఫ్రాంక్ ఫర్డు భౌతిక శాస్త్ర సంఘం అధ్వర్యంలో విజ్ఞాన శాస్త్రజ్ఞుల ముందు తన పరికరాన్ని ప్రదర్శించి ఫిలిప్ రీన్ ఉపన్యసించాడు. "విద్యుత్ ద్వారా టెలీఫోన్" అనే అంశం పై మాట్లాడుతూ అతను ఇలా చెప్పాడు. --"ఏ శబ్దమైనా మన చెవిలో కంపనాలు సృష్టిస్తుంది. వీటిని గ్రాఫ్ ద్వారా సూచించవచ్చు. ఈ కంపనాలను కృత్రిమ పద్ధతుల్లో సృష్టించగలిగితే, అవి మనకు సహజ శబ్దాల లాగే వినబడతాయి." వుపన్యాసం, ప్రయోగ ప్రదర్శన సవ్యంగానే జరిగాయి. ఇది సంచలనాత్మకంగా ఉంటుందని వూహించిన రీన్ కి నిరాశ కలిగింది. అల్లిక సూది నుంచి వెలువడిన శబ్దాలను విన్న మేధావులు అందరూ కేవలం మందహాసం ప్రదర్శించి ఇళ్ళకు వెళ్ళి పోయారు. Annals of the physical society పత్రికలో మాత్రం ఓ చిన్న నివేదిక ముద్రించబడింది. టెలీఫోన్ కేవలం అతి సాధారణమైన ఓ పరికరమని అందులో రాయబడింది. ఉత్సాహ వంతులైన కొందరు యువకులు మాత్రం ఆ పరికరం నమూనాలు కావాలని అడిగారు.

సుమారు రెండేళ్ళ తరువాత "చిన్న పిల్లలకో ఆట బొమ్మ" అనే శీర్షిక కింద టెలిఫోన్ ని ఎలా నిర్మించాలో ప్రఖ్యాత జర్మన్ పత్రిక డీ గార్టన్ లాబ్ వివరించింది. మరో సంవత్సరం గడిచాక గీసెన్ నగరంలో నెచురల్ హిస్టరీ కాంగ్రెస్ సమావేశం జరిగినప్పుడు రీన్ తన పరికరాన్ని అక్కడ ప్రదర్శించాడు. ప్రేక్షకుల్లోని కొందరు యువ శాస్త్రజులు అతణ్ణి ప్రశంసించారు. ఈ సమావేశంలో కొంత ప్రచారం లభించాక Annala of the physical society పత్రిక టెలిఫోన్ పై ఓ వ్యాసం రాయాలని రీన్ ని కోరింది. "సమయం మించిపోయింది. మీ పత్రికలో ప్రచురించకపోయినా నా పరికరానికి ప్రపంచమంతటా ప్రచారం లభిస్తుంది."—అని రీస్ ప్రత్యుత్తరం వ్రాశాడు. సమయం నిజంగానే మించిపోయింది. కొన్నాళ్ళకు అతని ఆరోగ్యం దెబ్బతింది. జబ్బుతో చాలా కాలం బాధపడ్డాడు తన పరికరంతో దేశదేశాల్లో ప్రతిధ్వనింప జేయాలనుకున్న కంఠధ్వని హరించుకుపోయింది. "నేను ప్రపంచానికో కొత్త పరికరాన్ని సమర్పించాను. దాన్ని మెరుగు పరిచే బాధ్యత ఇతరులపైనా ఉంది." అని చనిపోయే ముందు మితృని చెవిలో చెప్పాడట రీస్. చనిపోయే నాటికి అతని వయస్సు 40 ఏళ్ళు మాత్రమే.

Other Languages
English: Telephone
हिन्दी: दूरभाष
ಕನ್ನಡ: ದೂರವಾಣಿ
தமிழ்: தொலைபேசி
മലയാളം: ടെലിഫോൺ
Afrikaans: Telefoon
Alemannisch: Telefon
አማርኛ: ስልክ
aragonés: Telefón
Ænglisc: Feorrspreca
العربية: هاتف
ܐܪܡܝܐ: ܙܥܘܩܐ
مصرى: تليفون
asturianu: Teléfonu
azərbaycanca: Telefon
تۆرکجه: تلفون
башҡортса: Телефон
žemaitėška: Tilipuons
беларуская: Тэлефон
беларуская (тарашкевіца)‎: Тэлефон
български: Телефон
भोजपुरी: टेलीफोन
বাংলা: টেলিফোন
brezhoneg: Pellgomz
bosanski: Telefon
català: Telèfon
Mìng-dĕ̤ng-ngṳ̄: Diêng-uâ
нохчийн: Телефон
Tsetsêhestâhese: Aseéestsestôtse
کوردی: تەلەفۆن
čeština: Telefon
Чӑвашла: Телефон
Cymraeg: Ffôn
dansk: Telefon
Deutsch: Telefon
Thuɔŋjäŋ: Cɔ̈tmec
Zazaki: Têlefon
Ελληνικά: Τηλέφωνο
Esperanto: Telefono
español: Teléfono
eesti: Telefon
euskara: Telefono
فارسی: تلفن
suomi: Puhelin
Võro: Telehvon
français: Téléphone
Frysk: Telefoan
Gaeilge: Guthán
贛語: 電話
Gàidhlig: Fòn
galego: Teléfono
Avañe'ẽ: Pumbyry
Gaelg: Çhellvane
עברית: טלפון
hrvatski: Telefon
Kreyòl ayisyen: Telefòn
Հայերեն: Հեռախոս
interlingua: Telephono
Bahasa Indonesia: Telepon
Interlingue: Telefon
Iñupiak: Uqautitaun
íslenska: Sími
italiano: Telefono
日本語: 電話機
Patois: Telifuon
la .lojban.: fonxa
Basa Jawa: Tilpun
ქართული: ტელეფონი
қазақша: Телефон
kalaallisut: Oqarasuaat
ភាសាខ្មែរ: ទូរស័ព្ទ
한국어: 전화
къарачай-малкъар: Телефон
कॉशुर / کٲشُر: ٹیلِفون
Ripoarisch: Tellefoon
Kurdî: Telefon
Latina: Telephonum
Ladino: Telefon
Lëtzebuergesch: Telefon
Limburgs: Tillefoean
lingála: Ebengeli
lietuvių: Telefonas
latviešu: Telefons
Malagasy: Telefaonina
македонски: Телефон
मराठी: दूरध्वनी
Bahasa Melayu: Telefon
မြန်မာဘာသာ: တယ်လီဖုန်း
Nāhuatl: Huehcacaquiztli
Napulitano: Telèfene
Nedersaksies: Tillefoon
नेपाली: टेलिफोन
Nederlands: Telefoontoestel
norsk nynorsk: Telefon
norsk: Telefon
occitan: Telefòn
Livvinkarjala: Telefon
ਪੰਜਾਬੀ: ਟੈਲੀਫ਼ੋਨ
Deitsch: Foohn
Pälzisch: Telefon
polski: Telefon
Piemontèis: Teléfon
پنجابی: ٹیلی فون
پښتو: غږلېږدی
português: Telefone
Runa Simi: Karu rimay
română: Telefon
armãneashti: Telefonu
русский: Телефон
русиньскый: Телефон
संस्कृतम्: दूरवाणी
саха тыла: Төлөппүөн
sicilianu: Telèfunu
Scots: Telephone
srpskohrvatski / српскохрватски: Telefon
සිංහල: දුරකථනය
Simple English: Telephone
slovenčina: Telefón
slovenščina: Telefon
Gagana Samoa: Telefoni
chiShona: Runhare
Soomaaliga: Taleefoon
shqip: Telefoni
српски / srpski: Телефон
Basa Sunda: Telepon
svenska: Telefon
Kiswahili: Simu
тоҷикӣ: Телефон
Tagalog: Telepono
Türkçe: Telefon
татарча/tatarça: Телефон
українська: Телефон
اردو: فون
oʻzbekcha/ўзбекча: Telefon
vepsän kel’: Telefon
Tiếng Việt: Điện thoại
walon: Telefone
Winaray: Telepono
吴语: 电话
მარგალური: ტელეფონი
ייִדיש: טעלעפאן
中文: 电话
文言: 電話
Bân-lâm-gú: Tiān-ōe
粵語: 電話