జురాసిక్ పార్క్ ఫ్రాంచైస్

Jurassic Park film series
దర్శకత్వంSteven Spielberg (Jurassic Park & The Lost World: Jurassic Park)
Joe Johnston (Jurassic Park III)
రచనMichael Crichton (Jurassic Park & The Lost World)
Malia Scotch Marmo (Jurassic Park)
David Koepp (Jurassic Park & The Lost World)
Alexander Payne (Jurassic Park III)
Peter Buchman (Jurassic Park III)
Jim Taylor(Jurassic Park III)
సంగీతంJohn Williams (Jurassic Park & The Lost World)
Don Davis (Jurassic Park III)
పంపిణీదారుUniversal Pictures
విడుదల
1993 - present
దేశంUnited States
భాషEnglish
ఖర్చు$229,000,000
బాక్సాఫీసు$1,902,110,923

జురాసిక్ పార్క్ ఫ్రాంచైస్ అనేది క్లోండ్ రాక్షసబల్లుల థీం పార్క్ ను సృష్టించుటకు చేసిన విపత్కరమైన ప్రయత్నానికి సంబంధించిన పుస్తకాలు, సినిమాలు, బొమ్మల కథలు మరియు వీడియోల ధారావాహిక. 1990లో యూనివర్సల్ స్టూడియోస్ మైఖేల్ క్రింక్టన్ రాసిన నవల ప్రచురణకు ముందే దాని హక్కులను కొనుగోలు చేయడంతో ఈ ప్రయత్నము మొదలయ్యింది.

ఈ నవల ఆధారంగా వచ్చిన 1993 ఫిలిం అడాప్షన్ సాధించిన విజయంలాగానే ఈ నవల పెద్ద విజయం సాధించింది. ఈ విజయం రెండు కొనసాగింపు సినిమాలకు దారి తీసింది. అయితే చివరిది మాత్రం మొదట వచ్చిన సినిమాల లాగా నవల ఆధారితం కాదు. 1993 సినిమా నుండి వీడియో ఆటలను అభివృద్ధి చేసే హక్కులను ఓషన్ సాఫ్ట్వేర్, బ్లూస్కై సాఫ్ట్వేర్, సెగా ఆఫ్ అమెరికా మరియు టెల్టేల్ గేమ్స్ వంటి సాఫ్ట్వేర్ కంపనీలు తీసుకుని ఎన్నో రకాలైన వీడియో ఆటలను అభివృద్ధి చేశాయి.

మూడవ సినిమా తరువాత ప్రస్తుతము నాల్గవ చలన చిత్రం తయారి దశలో ఉంది కాని సంవత్సరంనుండి డెవలప్మెంట్ హెల్ లో వేలాడుతోంది. ఈ ప్రాజెక్టు యొక్క నేపథ్యం, రచన మరియు కొత్త లోగోలకు సంబంధించి ఎన్నో పుకార్లు ప్రారంభ దశ నుండి ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు తయారు అవుతున్న నాల్గవ సినిమా పాత సినిమాల లాగా కాకుండా కొత్త నేపథ్యంతో వస్తుందని జురాసిక్ పార్క్ III దర్శకుడైన జో జాన్స్టన్ నవంబరు 2009లో తెలిపారు.[1]