కల్పనా చావ్లా

కల్పనా చావ్లా
కల్పనా చావ్లా
వ్యోమగామి
జాతీయత అమెరికా మరియు భారత్
ప్రస్తుతం చనిపోయారు
జననం మార్చి 17, 1962
కర్నాల్, హర్యానా, భారతదేశం
మరణం ఫిబ్రవరి 1, 2003 ( 40 సంవత్సరాలు)
టెక్సాస్ పై
మునుపటి
వృత్తి
విజ్ఞాని 1994 NASA Group
అంతరిక్షంలో గడిపిన కాలం 31d 14h 54m
ఎంపిక
మిషన్ STS-87, STS-107
Mission
insignia
Sts-87-patch.svg STS-107 Flight Insignia.svg

కల్పనా చావ్లా ( మార్చి 17, 1962ఫిబ్రవరి 1, 2003), ఈమె ఒక ఇండియన్ -అమెరికన్ వ్యోమగామి మరియు వ్యొమనౌక యంత్ర నిపుణురాలు.

బాల్యం

కల్పనా చావ్లా భారత దేశంలోని హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ పట్టణంలో 1962 మార్చి 17 న జన్మించింది. ఆమె పాఠశాలలో చేరినప్పుడు రికార్డుల ప్రకారం అధికార జన్మదినం జూలై 1 1961. తల్లిదండ్రులకు ఈమె చివరి సంతానం. [1] సునీత, దీప, సంజయ్ ల తర్వాత ఈమె జన్మించారు. ఇంట్లో అందరూ ముద్దుగా "మోంటు" అని పిలుచుకొనే కల్పనా చావ్లా కులీన కుటుంబంలో పుట్టలేదు. తండ్రి బనారసీలాల్ చావ్లా సాధారణ వ్యాపారి కల్పనపై ఆయన ప్రభావం ఎక్కువ. పేదరికం నుంచే ఆయన పైకెదిగారు. పట్టుదల, అందుకు తగిన కృషి ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించిన వ్యక్తి ఆయన. చిన్నగా టైర్ల వ్యాపారాన్ని ప్రారంభించిన ఆయన తొలుత ఎన్నో కష్టనష్టాలకు గురయ్యారు. అయినా దాన్ని వదలకుండా అనుకున్నది సాధించేందుకు ముందుకు సాగిపోయారు. అప్పటి వరకూ టైర్ల తయారీకి విదేశీ యంత్రాన్ని ఉపయోగించేవారు. ఆ క్రమంలో ఆయన దేశీయంగానే ఆ యంత్రాన్ని రూపొందించారు. బనారసీలాల్ శ్రమ ఫలించింది. రాష్ట్రపతి నుంచీ అభినందనలు అందుకున్నారు. తర్వాత డబ్బుకోసం బనారసీ కుటుంబం ఇబ్బంది పడింది లేదు. ఆడపిల్లే అయినా జీవితంలో ఏదో సాధించాలన్న తపన కల్పనలో పాదుకోవడానికి తండ్రేకారణం. "పరిస్థితులు ఎలాగున్నా... కన్న కలల్ని నిజం చేసుకోవడమే అంతిమ లక్ష్యం అన్న మాటలు నా తండ్రి జీవితంలో నిజమయ్యాయి. ఫలితంగా అవే నాలోనూ జీర్ణించుకుకుపోయాయి. అందుకు నాన్నే కారణం." అంటూ తొలి అంతరిక్షయానం తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆలోచనలు ఏ విధంగా ప్రభావితమయిందీ కల్పన వివరించారు.

Other Languages
മലയാളം: കൽപന ചൗള
беларуская: Калпана Чаўла
български: Калпана Чаула
español: Kalpana Chawla
français: Kalpana Chawla
ગુજરાતી: કલ્પના ચાવલા
Bahasa Indonesia: Kalpana Chawla
italiano: Kalpana Chawla
ភាសាខ្មែរ: Kalpana Chawla
한국어: 칼파나 촐라
Malagasy: Kalpana Chawla
Nederlands: Kalpana Chawla
پنجابی: کلپنا چاولہ
português: Kalpana Chawla
română: Kalpana Chawla
संस्कृतम्: कल्पना चावला
Simple English: Kalpana Chawla
slovenčina: Kalpana Chawlová
Türkçe: Kalpana Chawla
українська: Калпана Чавла