కర్బూజ

కర్బూజ
Muskmelon.jpg
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం:Plantae
క్రమం:Cucurbitales
కుటుంబం:Cucurbitaceae
జాతి:Cucumis
ప్రజాతి:melo

ఉపోద్ఘాతం

కర్బూజ దోస జాతికి చెందిన పండు. దీని శాస్త్రీయ నామం కుకుమిస్ మెలో. మరొక పేరు కుకుర్బిట మాక్సిమా.

ఇది దోస రకానికి చెందింది కాబట్టి దీన్ని కూరగాయ అనికొద్ది మంది వర్గీకరిస్తుంటారు.

దీని పై తోలు మందంగా, గరుకుగా వుంటుంది. కానీ మాలోపల మాత్రం అంతా మెత్తగా ఉంటుంది. కొన్ని రకాల్లో తోలు కూడా పలుచగానే ఉంటుంది. ఇవి పక్వానికి వచ్చే తరుణంలో ఒక రకమైన వాసనను వెలువరిస్తాయి. మస్క్‌ డీర్అ నే ఒక రకమైన జింక నుండి కూడా ఒక అద్భుతమైన సువాసన వెలువడుతుంది. ఆ సువాసన గుర్తుకు తెచ్చేలా వుంటుంది కాబట్టి, ఈ వాసనను బట్టి వీటికి మస్క్‌ మెలన్‌ (muskmelon) అనే పేరు కూడా ఉంది. అయితే ఇవి మగ్గితేనే ఆ వాసన విడుదల చేస్తాయి.

కర్బూజ యొక్క జన్మ స్థలాలు ఇరాన్, అనటోలియా మరియు అర్మీనియా ప్రాంతాలు అయిఉండవచ్చని భావిస్తారు. వాయవ్య భరత ఖండంలో, ప్రత్యేకించి కాశ్మీర్‌, ఆఫ్ఘనిస్తాన్లు ద్వితీయ కేంద్రాలు. అక్కడి నుండి చైనా, పర్షియా ప్రాంతాలకు వ్యాపించాము. వీటిలో అడవి రకాలు ఎన్నో ఆ ప్రాంతాలలో కనిపించేవి. ఇవి క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దంలోనే గ్రీకు దేశంలో సాగులో ఉండేవిట. వీటిలోని ఔషధ గుణాల గురించి క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దంలోనే గ్రీకు వైద్యుడు గాలెన్‌ వివరించాడు. రోమన్లు కూడా సాగు చేసేవారు.

ఈ మొక్క అనేక సాగురకాలు (cultivars) గా అభివృద్ధి చెందింది. వీటిలో సున్నితమైన చర్మం రకాలు ఉన్నాయి. అమెరికా దొసకాయ కూడా కర్బూజ లోని ఒక రకము. కానీ దాని ఆకారం, రుచి, ఉపయోగాలు చాలా వరకు దోసకాయను పోలి ఉంటాయి. ఇది "పెపో" అనే రకం పండు.

Other Languages
മലയാളം: മത്തൻ
aragonés: Cucurbita maxima
azərbaycanca: İri balqabaq
català: Carabassa
Tsetsêhestâhese: Mo'ôhtáemâhoo'o
dolnoserbski: Wjelicka banja
Esperanto: Gigantkukurbo
فارسی: کدوی تنبل
français: Potiron
galego: Caiota
Avañe'ẽ: Kurapepẽ
hornjoserbsce: Hoberski banjowc
한국어: 서양호박
Nederlands: Reuzenpompoen
occitan: Aubièca
Picard: Paturon
português: Cucurbita maxima
Runa Simi: Sapallu
română: Dovleac
svenska: Jättepumpa
lea faka-Tonga: Hina (ʻakau)
Tiếng Việt: Cucurbita maxima