ఒసామా బిన్ లాదెన్

ఒసామా బిన్ లాదెన్ (Osama bin Laden (1957-2011) అల్ ఖైదా అను అంతర్జాతీయ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ నాయకుడు. 9/11 దాడుల ప్రధాన సూత్రధారి. ఈ దాడిలో 2, 976 అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 6000+ మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇతను ఒక వైపు అమెరికాకి వ్యతిరేకంగా పోరాడుతూనే మరో వైపు ప్రత్యర్థి ఇస్లామిక్ సంస్థలతో ఘర్షిస్తున్నాడు. మే 1, 2011 తేదీన అమెరికా సైన్యం జరిపిన ఒక ఆపరేషన్ లో ఇతను చనిపోయినట్లు అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రకటించాడు.

కుటుంబ నేపథ్యం

ఒసామా తండ్రి షేక్ మహమ్మద్ మూమూలు స్థాయి నుండి బిన్ లాడెన్ కన్‌స్ట్రక్షన్ కంపెనీని స్థాపించే దశకి ఎదిగాడు. సౌదీలో అది అతి పెద్ద కంపెనీ. ఆయన 22 పెళ్ళిళ్ళు చేసుకుని, 25 మంది కొడుకులకూ, 29 మంది కూతుళ్ళకూ తండ్రయ్యాడు. 23వ వివాహం చేసుకునే నిమిత్తం వెళుతూ విమాన ప్రమాదంలో చనిపోయాడు.
బిన్ లాడెన్ కుటుంబానికీ, సౌదీ రాజుల కుటుంబానికీ సత్సంబంధాలు ఉన్నాయి. ఇస్లామును పటిష్ఠంగా పాటించేవారుగా, దక్షతగల వ్యాపారవేత్తలుగా, ధనవంతులుగా బిన్ లాడెన్ కుటుంబం గుర్తింపు పొందింది.
బిన్ లాడెన్ కుటుంబంలో సంగీతం, నృత్యం ..హరామ్ అంటారు. పుట్టినరోజు వేడుకలు జరపరు.
ఒసామా బిన్ లాడెన్ తల్లి తరుఫు బంధువు నజ్ వా (సిరియన్) ను పెండ్లాడాడు. ఆమెకు 30 ఏళ్లు రాకుండానే వరుసగా 7 మంది కొడుకుల్ని కన్నది. అతను లెబనాన్ లో చదివే రోజుల్లో విలాస పురుషుడేనట. తరువాత ఇస్లాంను కఠినంగా పాటిస్తూ, వ్యక్తిగా ఏ ప్రత్యేకత లేకున్నా, అందరి మన్నన పొందాడు. సౌదీ రాజుల విలాసవంతమైన జీవితాన్ని విమర్శించినందుకు దేశబహిష్కరణకు గురయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ వీరుడిగా, అమెరికా విరోధిగా ఎదిగాడు. కుటుంబంతోనూ, రాజకుటుంబంతోనూ బంధాలు వీడలేదు.[1]

Other Languages
Afrikaans: Osama bin Laden
Alemannisch: Osama bin Laden
አማርኛ: ቢን ላዲን
aragonés: Osama bin Laden
العربية: أسامة بن لادن
asturianu: Osama bin Laden
azərbaycanca: Üsamə bin Laden
žemaitėška: Osama bin Ladens
Bikol Central: Osama bin Laden
беларуская: Усама бін Ладэн
беларуская (тарашкевіца)‎: Усама бін Ладэн
български: Осама бин Ладен
brezhoneg: Ousama ben Laden
bosanski: Osama bin Laden
Mìng-dĕ̤ng-ngṳ̄: Osama bin Laden
dolnoserbski: Osama bin Laden
Esperanto: Usama bin Laden
español: Osama bin Laden
estremeñu: Osama bin Laden
føroyskt: Osama bin Laden
客家語/Hak-kâ-ngî: Osama bin Laden
Fiji Hindi: Osama bin Laden
hrvatski: Osama bin Laden
interlingua: Osama bin Laden
Bahasa Indonesia: Usamah bin Ladin
Interlingue: Osama bin Laden
íslenska: Osama bin Laden
italiano: Osama bin Laden
Taqbaylit: Usama Ben Laden
Lëtzebuergesch: Osama Bin Laden
lumbaart: Osama bin Laden
latviešu: Osama bin Ladens
Basa Banyumasan: Osama bin Laden
Malagasy: Osama Bin Laden
олык марий: Усама бен Ладен
македонски: Осама бин Ладен
Bahasa Melayu: Osama bin Laden
Mirandés: Osama bin Laden
မြန်မာဘာသာ: အိုစမာ ဘင်လာဒင်
مازِرونی: اسامه بن لادن
Plattdüütsch: Osama bin Laden
नेपाल भाषा: ओसामा बिन लादेन
Nederlands: Osama bin Laden
norsk nynorsk: Osama bin Laden
Papiamentu: Osama bin Laden
Piemontèis: Osama bin Laden
português: Osama bin Laden
română: Osama bin Laden
саха тыла: Осама бен Ладен
sicilianu: Osama bin Laden
srpskohrvatski / српскохрватски: Osama bin Laden
Simple English: Osama bin Laden
slovenčina: Usáma bin Ládin
slovenščina: Osama bin Laden
Soomaaliga: Usaama bin Laadin
shqip: Bin Laden
српски / srpski: Осама бин Ладен
Seeltersk: Osama Bin Laden
Kiswahili: Osama bin Laden
ślůnski: Usama ibn Ladin
Türkçe: Usame bin Ladin
українська: Осама бен Ладен
oʻzbekcha/ўзбекча: Usoma bin Lodin
Tiếng Việt: Osama bin Laden
吴语: 本·拉登
Yorùbá: Osama bin Laden
文言: 拉登
Bân-lâm-gú: Osama bin Laden
粵語: 賓拉登